ఆ విషయంలో విజ‌య్, అల్లు అర్జున్ సాటి ఎవరు లేరట..?

frame ఆ విషయంలో విజ‌య్, అల్లు అర్జున్ సాటి ఎవరు లేరట..?

Suma Kallamadi
టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏదైనా సరే సినిమా తారల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఏ యాక్టర్ కు తగ్గట్టు వాళ్ళు వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా అగ్ర హీరోల పన్ను చెల్లింపు దారుల లిస్ట్ బయటకు వచ్చింది. ఇందులో భాగంగానే పన్ను చెల్లింపులలో షారుఖ్ ఖాన్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఇక సౌత్ ఇండియాకు చెందిన అగ్ర హీరో విజయ్ దళపతి నెంబర్ 2 స్థానంలో ఉన్నట్లు సమాచారం. షారుఖ్‌ ఖాన్ రూ.92 కోట్లు పన్ను చెల్లించగా విజయ్ ఏకంగా రూ.80 కోట్ల పన్నును చెల్లించినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా మరొక విశ్లేషణలో దాదాపు 7300 కోట్ల సంపద ఉన్న షారుక్ ఖాన్, 410 కోట్ల ఉన్న విజయ్ దళపతితో పోలుస్తే తక్కువ మొత్తంలోనే చెల్లింపులు చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. అతి పెద్ద భారీ వ్యాపారాలు ఉన్న షారుఖ్‌ 100 కోట్ల లోపు పన్ను చెల్లింపులు మాత్రమే చేస్తారు. అయినా కానీ అతడు నెంబర్ వన్ టాక్స్ పేయర్ గా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. అయితే షారుఖ్ ఖాన్ పటాన్, జవాన్ లాంటి సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ తీసుకోగా విజయ్ గత ఏడాది లియో లాంటి యావరేజ్ సినిమాకి నార్మల్ గా రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇక షారుక్ ఖాన్ తో పోలిస్తే విజయ్ కి ఆదాయాల మార్గాలు చాలా తక్కువనే అని అంచనా.
ఇక టాప్ 20 జాబితాలో నిలిచిన మరొక ఏకైక తెలుగు స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ 17 కోట్ల పన్ను చెల్లింపులతో టాలీవుడ్ లో నెంబర్ వన్ అగ్ర హీరోగా నిలిచాడు. ఇక బన్నీకి మల్టీప్లెక్స్ రంగం నుంచి భారీగా ఆదాయాలు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ లో ఉన్న ఏఏఏ సినిమాస్ నుంచి భారీ సక్సెస్ అయ్యాడు. అలాగే ఓటీటీ రంగంలో అల్లు వారి ఆహా  ద్వారా విభిన్న వ్యాపారాల ద్వారా రెమ్యునరేషన్ విషయాలలో భారీగా ఆదాయాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: