నిఖిల్ పై విరుచుకుపడిన యష్మీ బిగ్ బాస్ ప్లాన్ మాములుగా లేదుగా

frame నిఖిల్ పై విరుచుకుపడిన యష్మీ బిగ్ బాస్ ప్లాన్ మాములుగా లేదుగా

Suma Kallamadi
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ 8  ఎంతో ఆసక్తికరంగా కొన సాగుతుంది. తొలి వారంలోనే హౌస్ లో గొడవలు మొదలయ్యాయి. ఒకవైపు  కంటెస్టెంట్స్ కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే మరోవైపు నువ్వా నేనా అంటూ గొడవలు పడుతున్నారు కొంతమంది కంటెస్టెంట్స్. మొదటి వారం నామినేషన్ లో భాగంగా ముగ్గురు చీఫులుగా ఎన్నుకొని వారికంటూ ఒక ప్రత్యేక సైనం అంటూ హౌస్ అందర్నీ గుంపులుగా విడగొట్టారు. అయితే ఈ క్రమంలో హౌస్ లో ముగ్గురు చీఫ్ లలో ఎవరు గొప్ప అనే విషయాన్ని తేల్చుకోవాల్సిందిగా బిగ్ బాస్ ఒక ప్రకటన   చేశాడు.. ఈ క్రమంలో యష్మీ, నైనిక  టీమ్స్ మధ్య ఒక గేమ్ పెట్టగా ఎవరు గెలిస్తే వారు నిఖిల్ టీం నుంచి ఒక సభ్యుడు తీసుకోవచ్చు అని ఆఫర్ ను  ఇచ్చాడు.
అయితే ఫస్ట్ టాస్క్ లో భాగంగా యష్మి సులభంగా గెలిచింది అయితే మీరు నిఖిల్ టీం నుంచి ఎవరు సెలెక్ట్ చేసుకుంటారేమో అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమో ఆధారంగా ఇద్దరి దోస్తుల మధ్య చిచ్చుపెట్టేసాడు బిగ్ బాస్ అన్నాట్టు ఉంది. షో మొదటి రోజు నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్న వీరు ఇద్దరూ , అలాగే కొన్ని సందర్భాలలో ఇద్దరు ఒకే మాట మీద ఉంటున్నారు.. యష్మి  చీఫ్ గా కావడానికి మెయిన్ రీజన్ నిఖిల్.. నైనిక నబీల్  పేరు చెప్పగా నిఖిల్ మాత్రం యష్మీ చీఫ్ గా కావాలంటూ నైనిక ను ఒప్పించిన సంగతి మనం చూసాం. దీంతో నైనిక నిఖిల్ తోపాటు యష్మి కూడా చీఫ్ గా నిలిచింది.. చివరికి ఇప్పుడు వీరిద్దరి  మధ్య కూడా పెద్ద గొడవ జరిగినట్లు ప్రోమోలో తెలుస్తుంది.

విడుదలైన ప్రోమోలో రెండు టీమ్స్ మధ్య సెకండ్ టాస్క్ ప్రారంభం అయింది.. రెండు టీం సభ్యులు అందరూ కూడా చైన్ సిస్టం లాగా నిలబడి చేతులతో పట్టుకొని శరీరాల మీదగా రింగ్స్ ఒకవైపు నుంచి మరోవైపుకు వేయాల్సి ఉంటుంది. అయితే యష్మి టీం రింగ్స్ అన్నిటిని శరీరం మొత్తానికి తిప్పి తీసుకెళ్లారు కానీ. నైనిక టీం సభ్యులు మాత్రం కేవలం.. .ఈ టాస్కులో నైనిక టీం ముందుగా రింగ్స్ అన్నింటిని మరోవైపుకు చేరవేయడంతో నైనిక టీం గెలిచిందని నిఖిల్ చెప్తాడు. ఈ క్రమంలో యష్మీ టీం గొడవకు దిగుతుంది. బిగ్‏బాస్ శరీరం మొత్తం తిప్పి రింగ్స్ తీసుకురావాలని చెప్పారని చెప్పడంతో శరీరం మొత్తం అని చెప్పలేదు.. శరీరం నుంచి అని చెప్పారంటూ నైనిక టీం వాదనకు దిగింది. ఇక నిఖిల్ కూడా నైనిక టీంకు సపోర్ట్ చేయడంతో యష్మీ కూడా కోపంతో నిఖిల్ పై గొడవకు దిగిని . రూల్స్ బ్రేక్ చేస్తున్నారంటూ అంటూ వాపోయింది.. అయితే  నిఖిల్ కూడా యష్మీకి క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి రెండో టాస్కులతో స్నేహితుల ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేసాడు బిగ్ బాస్.



 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: