పుష్ప పార్ట్ 2 : అప్పటివరకు ఆ సీన్స్ ని హోల్డ్ లో పెట్టిన సుకుమార్.. పెద్ద ప్లాన్ వేశాడుగా..?

frame పుష్ప పార్ట్ 2 : అప్పటివరకు ఆ సీన్స్ ని హోల్డ్ లో పెట్టిన సుకుమార్.. పెద్ద ప్లాన్ వేశాడుగా..?

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 అనే మూవీ చిత్రీకరణ జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎక్కడ తగ్గకుండా మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితం వరకు ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆగస్టు 15 వ తేదీ వరకు చాలా పెండింగ్ ఉండే అవకాశం ఉండడంతో ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఒక వైపు జరుగుతూనే ఉండగా మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అంతే స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని మొదటి భాగంలో ఐటమ్ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో సక్సెస్ అయ్యింది. సమంత "పుష్ప పార్ట్ 1" లో ఐటమ్ సాంగ్ లో నటించింది. ఆ సాంగ్ అద్భుతమైన విజయం సాధించింది. ఆ పాట ద్వారా సమంత కు మంచి గుర్తింపు లభించింది.

దానితో పుష్ప రెండవ భాగంలో ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారా ..? అనే ఆసక్తి జనాల్లో బాగా పెరిగింది. సుకుమార్ ఈ సినిమాలోని ఐటెం సాంగ్ కోసం ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన ఐటమ్ సాంగ్ ను షూట్ చేయాలి అని సుకుమార్ డిసైడ్ అయినట్లు , ఆ తర్వాత వెంటనే ఈ సాంగ్ ను రిలీజ్ చేయాలి అని కూడా మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు ఈ సినిమా ఐటమ్ సాంగ్ ను షూట్ చేయకుండా ఉండాలి అనే మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: