యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై తారక్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఇప్పటికే ఓ సారి విడుదల వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ను ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల కానున్న మూవీ ఇది. విడుదలకి ఎక్కువ రోజులు టైం లేదు కాబట్టి.. ప్రమోషన్ డోస్ పెంచాల్సి ఉంది. నిన్న విడుదలైన ‘దావూదీ’ పాటకి మిశ్రమ స్పందన లభించింది.కాబట్టి ఆ నెగిటివిటీకి బ్రేకులు వేయాలంటే.. టీజర్, ట్రైలర్ వంటివి బయటకు వదలాలి.టీజర్ అయితే ఇక ఏమీ ఉండదట. డైరెక్ట్ గా ట్రైలర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. వినాయక చవితి టైంకి ట్రైలర్ రెడీ అవుతుంది. ఆ తర్వాత తెలుగులో ఓ ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాలని ‘దేవర’ బృందం భావిస్తుంది. ఐటీసీ కోహినూర్లో ఈ వేడుక జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అది కూడా హిందీ ప్రమోషన్స్ కి, అలాగే ఇతర భాషల్లో చేయాల్సిన ప్రమోషన్స్ కోసం వేసుకున్న షెడ్యూల్ అడ్జస్ట్ అయితేనే..! లేదు అంటే.. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే ఉంటుందని వినికిడి.వినాయక చవితి నాటికి అయితే ట్రైలర్ గురించి ఓ అప్డేట్ అయితే రావచ్చని అంటున్నారు. చూడాలి ఏమవుతుందో. ఇదిలావుండగా 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. ఇప్పటికే రెండు చార్ట్-టాపింగ్ సింగిల్స్‌తో "దేవర" సెన్సేషన్ సృష్టించింది. "ఫియర్ సాంగ్" మరియు రొమాంటిక్ "చుట్టమల్లె" తరువాత మూడవ సింగిల్ "దావుడి" సాంగ్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 30 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం.ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు.ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.