యూట్యూబ్ ని షేక్ చేస్తున్న దేవర "దావుదీ" సాంగ్..!!

frame యూట్యూబ్ ని షేక్ చేస్తున్న దేవర "దావుదీ" సాంగ్..!!

murali krishna
కొరటాల శివ.. తారక్ కాంబినేషన్ వస్తున్న దేవర. మూవీ హైప్ గురించి ఇప్పటికే చాలా వినేసి ఉంటారు. ఈ రేంజ్ లో హైప్ ఉన్న కారణంగానో లేదా వస్తున్న అప్ డేట్స్ నిజంగానే బావుండడం వలన హైప్ క్రియేట్ అవుతుందో తెలియదు కానీ..ఇప్పటివరకు దేవర నుంచి వస్తున్న ప్రతి అప్ డేట్ కూడా.. కొద్దీ గంటల్లోనే మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంటూ.. రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఒకటి రెండు కాదు ఇప్పటివరకు రిలీజ్ అయినా మూడు పాటలు కూడా.. దేవర మూవీ రిలీజ్ కు ముందే. రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి లేటెస్ట్ గా రిలీజ్ అయినా థర్డ్ సింగల్ కూడా సాంగ్ కూడా ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.దేవర సినిమా నుంచి నిన్న రిలీజ్ అయినా సాంగ్ దావుది .. ఈ సాంగ్ రిలీజ్ కు ముందు మేకర్స్ వరుస పోస్ట్ తో ఎలా అయితే ఊరించారో.. అంతకు మించిన కనుల పండుగగా సాంగ్ విజువల్స్ అదరగొట్టేశాయి. అసలు తారక్ అంటేనే డ్యాన్స్ కు పెట్టింది పేరు.. అలాంటిది ఆరేళ్ళ తర్వాత తారక్ ఇలా సోలోగా డ్యాన్స్ చేయడం చూసినా.. అభిమానుల ఆనందం అంత ఇంతా కాదు. అందుకోసమేనేమో గత రెండు రోజుల వ్యవధి లోనే 50 మిలియన్ వ్యూస్ ను సమీపిస్తుంది.గత 24 గంటల్లో అత్యధికంగా వీక్షించబడిన సౌత్ ఇండియన్ సాంగ్స్ లిస్ట్ లో.. ఈ సాంగ్ యాడ్ అయింది. కేవలం 24 గంటల్లోనే ఇన్ని వ్యూస్ రావడం.. కేవలం దేవరకు మాత్రమే సాధ్యం.. అలాగే ఇది దేవర ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పి తీరాలి.
అసలు ఈ సాంగ్ లో తారక్ , జాన్వీ కపూర్ పోటాపోటీగా డ్యాన్స్ చేసినట్లు అనిపించింది. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూ. ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్ కు అభిమానులు పిచ్చెక్కిపోయారు. ఇక్కడే ఇలా ఉంటె.. ఈ సాంగ్ కు థియేటర్ లు దద్దరిల్లిపోతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇలా రిలీజ్ కు ముందే క్రియేట్ చేస్తున్న సెన్సేషన్స్ చూస్తుంటే.. కచ్చితంగా రిలీజ్ తర్వాత ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేయడం ఖాయం అని చెప్పాల్సిందే. దేవర మూవీ రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో.. మూవీ టీం ప్రస్తుతం ప్రమోషన్స్ కు ప్లాన్ చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో వచ్చే అప్ డేట్స్ ఎలాంటి హైప్ పెంచుతాయో వేచి చూడాలి.ఇదిలావుండగా కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. దానికి తోడు ఆర్ఆర్ఆర్ వంటి అరివీర భయంకర హిట్టు తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్‌ల స్పీడ్ పెంచారు. ఈ సినిమా తొలిపార్టు సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. మరోవైపు జక్కన్నతో సినిమా చేసిన తర్వాత.. ఏ హీరో కూడా ఇప్పటి వరకు హిట్టు కొట్టలేదు.ఇప్పుడా సెంటిమెంట్ ను ఎన్టీఆర్ దేవరతో బ్రేక్ చేస్తాడని స్పష్టంగా తెలుస్తుంది. ఆచార్య వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఈ సినిమాతో వీర లెవల్లో కంబ్యాక్ ఇవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: