మిస్టర్ ఫర్ఫెక్ట్ టైమ్ లో అంత పెద్ద చర్చ జరిగిందా.. మూవీనే వద్దనుకున్న ప్రభాస్..?

frame మిస్టర్ ఫర్ఫెక్ట్ టైమ్ లో అంత పెద్ద చర్చ జరిగిందా.. మూవీనే వద్దనుకున్న ప్రభాస్..?

MADDIBOINA AJAY KUMAR
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా దశరథ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే మూవీ ని నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా స్టార్ట్ కావడానికి ముందు అనేక ఆసక్తికరమైన పరిణామాలు జరిగినట్లు దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దిల్ రాజు తాజాగా మాట్లాడుతూ ... ఒక రోజు దశరథ్ నాకు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకు సంబంధించిన కథ చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. దానితో వెంటనే నేను ప్రభాస్ కి ఫోన్ చేశాను. ఇలా ఒక కథ వచ్చింది.

వింటావా అన్నాను. ఓకే వింటాను అన్నాడు. వెంటనే ఫోన్ లోనే సినిమా కథను మొత్తం వినిపించాను. ఇక ప్రభాస్ కి ఆ కథ ఫస్ట్ ఆఫ్ నచ్చింది , కానీ సెకండాఫ్ పెద్దగా నచ్చలేదు. ఆ విషయాన్ని నాకు చెప్పాడు. దానితో నేను ఓకే కొన్ని రోజుల్లో సినిమా సెకండాఫ్ లో కూడా మార్పులు , చేర్పులు చేసి నీకు వినిపిస్తాను అని చెప్పాను. ప్రభాస్ కూడా ఓకే అన్నాడు. ఇక కొన్ని రోజులు గడిచింది. దశరథ్ సెకండాఫ్ కూడా కంప్లీట్ చేసి నాకు వినిపించాడు. అది నాకు బాగా నచ్చింది. ఇక ప్రభాస్ కి అది వినిపిద్దాం అనుకున్నాను. ఇక ప్రభాస్ వచ్చాడు. సినిమా కథ మొత్తం విన్నాడు. సూపర్ గా ఉంది అన్నాడు.

ఇక ఆ తర్వాత ప్రభాస్ నాతో మాట్లాడుతూ అసలు ఆ రోజు నాకు కథను వినిపించినప్పుడు ఈ మూవీ సెకండ్ హాఫ్ నాకు ఏ మాత్రం నచ్చలేదు. ఈ రోజు మీరు ఈ సినిమా సెకండ్ హాఫ్ వినిపిస్తాను అని చెప్పినప్పుడు నేను అసలు ఈ సినిమా చేయొద్దు అని చెప్పుదామని వచ్చాను. కానీ మీ కోసం సెకండ్ హాఫ్ విన్నాను. అది అద్భుతంగా నచ్చడంతో సినిమా ఓకే చేశాను. మీరు ఏదో మ్యాజిక్ చేస్తారు అని అన్నాడు. అలా ప్రభాస్ అసలు ఈ సినిమా చేయొద్దు అని చెబుదామని వచ్చి సినిమా కథ నచ్చడంతో చేశాడు అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: