మహిళల భద్రత కోసం రంగంలోకి దిగిన విశాల్.. ఆడవారికి అండగా..!

Divya
ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో ఆడవారు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు జస్టిస్ హేమా కమిటీ నివేదిక వెల్లడించడంతో పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాదు చాలామంది నటీమణులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ముందుకు వస్తూ అందరితో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందరూ తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పడానికి ముందుకు వస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు బయటకు చెబితే అవకాశాలు రావనే భయంతో వారు వెనుకడుగు వేస్తున్నారు. కానీ మరి కొంతమంది ధైర్యంగా తమ సమస్యలను చెప్పుకుంటున్నారు.
అయితే ఎవరైతే ధైర్యంగా ముందుకొచ్చి చెప్పలేకపోతున్న ఆడవారికి అండగా నిలిచారు నడిగర్ సంఘం అధ్యక్షులు ప్రముఖ స్టార్ హీరో విశాల్. చిత్ర సీమలో లైంగిక వేధింపుల ఫిర్యాదులపై తమిళ సినీ సంస్థ నడిగర్ సంఘం విచారణ చేపట్టింది. అంతర్గత ఫిర్యాదుల పరిష్కార సెల్ ను  ఏర్పాటు చేసి లైంగిక వేధింపుల ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని నడిగర్ సంఘం తెలిపింది. ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే నేరస్తులపై దాదాపు ఐదేళ్లపాటు నిషేధం విధిస్తారట. సినిమాకు సంబంధించి హేమా కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో తమిళ చిత్ర సీమలో మహిళల భద్రతపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో నడిగర్ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారికి అన్ని రకాల న్యాయ సహాయం అందేలా చూస్తామని తెలిపింది. దీని ద్వారా ఫిర్యాదులను తెలియజేయవచ్చని , ఫిర్యాదులు సైబర్ పోలీసులకు పంపుతారు అదే సమయంలో సినీ పరిశ్రమలు లైంగిక వేధింపుల ఫిర్యాదులను మహిళా ఫిలిం మేకర్స్ మీడియాకు చెప్పకూడదు అంటూ ఆదేశించింది.  ఫిర్యాదు ఉంటే ముందుగా ఐసీసీ కి తెలియజేయాలని ఆ సంస్థ తెలిపింది.. సుహాసిని రోహిణి, కుష్బూ తదితరులు హాజరైన ఈ సమావేశంలో సర్కులర్ ను  కూడా సిద్ధం చేశారు. ఇకపోతే బెంగాలీ నటి దాఖలు చేసిన కేసులో రంజిత్ పై ముందస్తు బెయిల్ పిటిషన్ ను  హైకోర్టు కొట్టి వేసింది. ఇక రంజిత్ పై ఆరోపణలు రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు నడిగర్ సంఘం నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: