ఆగస్టు చిన్న సినిమాలదే హవా.. సెప్టెంబర్ లో కూడా అలాంటి పరిస్థితే ఉండనుందా..?

MADDIBOINA AJAY KUMAR
ప్రస్తుతం చాలా పెద్ద పెద్ద నిర్మాతలు కూడా తక్కువ బడ్జెట్లో కథకు ప్రాధాన్యత ఉన్న చిన్న సినిమాలను నిర్మించడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. ఎందుకు అంటే ప్రేక్షకుల అభిరుచి మారడం , స్టార్ హీరోలతో రొటీన్ కమర్షియల్ సినిమాలు తీసిన బడ్జెట్ ఎక్కువ కావడం తప్ప రికవరీ లేకపోవడంతో తక్కువ బడ్జెట్ తో సినిమాలను రూపొందించిన సమయంలో ఎక్కువ డబ్బులు రావడం , ఒక వేళ ఆ సినిమా ఆడకపోయినా తక్కువ మొత్తంలో నష్టాలు ఉండడంతో పెద్ద నిర్మాతలు కూడా తక్కువ బడ్జెట్లో సినిమాలను నిర్మించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

అందులో భాగంగా ఆగస్టు నెలలో స్టార్ హీరోలు నటించిన పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే అద్భుతమైన కలెక్షన్లను రాబట్టాయి. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో కమిటీ కుర్రాళ్ళు , ఆయ్ , మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే మూడు చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. ఈ సినిమాలలో కమిటీ కుర్రాళ్ళు , ఆయ్ మూవీలు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా , మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఒకే నెలలో మూడు చిన్న సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకోవడంతో మేకర్స్ అంతా చిన్న సినిమాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ నెలలో కూడా మంచి అంచనాల నడుమ రెండు చిన్న సినిమాలు విడుదల కానున్నాయి.

ఈ నెలలో 35 మూవీ , జనక అయితే గనక అనే రెండు చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఈ మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో ప్రస్తుతం మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ లు కూడా మంచి సక్సెస్ సాధించినట్లు అయితే చిన్న సినిమాల డిమాండ్ తెలుగు సినీ పరిశ్రమలు మరింత పెరిగి అవకాశం ఉంటుంది. మరి ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ విజయాలను అందుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: