టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వరసకు బాబాయ్ , అబ్బాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇక చాలా ఇంటర్వ్యూ లలో పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ ఒకరి గురించి ఒకరు ఎన్నో ఫన్నీ విషయాలను చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం రామ్ చరణ్ , పవన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం. రామ్ చరణ్ చాలా సంవత్సరాల క్రితం మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ బాబాయ్ , మేము ఎప్పుడైనా విదేశాలకు వెళ్లినట్లు అయితే ఆయన మా అందరికీ బట్టలు కొనేవారు.
ఆయన కూడా ఏదో ఒక ప్యాంటు , షర్టు కొనుక్కొని ఎక్కడైనా బొమ్మల షాపు ఉంటే ఆ బొమ్మల షాపుకు వెళ్ళిపోయేవారు. ఇక బొమ్మల షాపు కు కి వెళ్లి అక్కడున్న బొమ్మలలో అనేక బొమ్మలు కొనేవారు. గన్స్ ఇలా అనేక బొమ్మలను కొని వారు. వాటితో ఆయన సరదాగా ఆడుకునే వారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారి వయస్సు దాదాపు 21 , 22 సంవత్సరాలు ఉంటుంది. అంత వయసు వచ్చిన కూడా ఆయన బొమ్మలతో ఆడుకునేవాడు అని చరణ్ చెప్పాడు. ఇక దానితో పవన్ కళ్యాణ్ అవును నేను నిజంగానే అంత వయస్సు వచ్చాక కూడా బొమ్మలతో ఆడుకునే వాడిని. దానిని చూసి నన్ను అంత చిన్న పిల్లాడు అనుకునేవారు అని పవన్ కళ్యాణ్ ఒకానొక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తూ ఉంటే , పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కెరియర్ గా కొనసాగించడం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి తో పాటు మరికొన్ని కీలక పాత్రలలో కొనసాగుతున్నాడు.