బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్లలో
రష్మీ గౌతమ్ కూడా ఒకరు. ఈటీవీలో చేస్తున్న ఎక్స్ ట్రా
జబర్దస్త్ ద్వారానే ఆమె స్టార్ యాంకర్ గా మారారని చెప్పొచ్చు. ఇతర
టీవీ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ
జబర్దస్త్ ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రధానంగా సుడిగాలి సుధీర్,
రష్మీ మధ్య ఉన్న
లవ్ ట్రాక్ మాత్రం సూపర్ హిట్ అయింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అందరినీ ఆకట్టుకుంది. బుల్లితెర ప్రేక్షకులంతా వీరి జంటకు
ఫిదా అయ్యారు. వివాహం చేసుకుంటారని అనుకున్నప్పటికీ తమ మధ్య అటువంటిదేమీ లేదని, కేవలం స్క్రీన్ పై మాత్రం
ప్రేమ జంటగా నటిస్తుంటామని, బయట అటువంటిదేమీ లేదని రష్మి స్పష్టంగా
చెప్పేసింది. సోషల్ మీడియాలో కూడా
రష్మీ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులు కూడా లక్షల సంఖ్యలో ఆమెను అనుసరిస్తుంటారు. మంచి ఫాలోయింగ్ ఉన్న రష్మీపై నెగెటివ్ కూడా బాగా ట్రోలవుతుంటుంది. కొందరు రష్మీని కావాలనే టార్గెట్ చేస్తారని అంటారు. కాగా
రష్మీ గౌతమ్ లేటెస్ట్ సోషల్
మీడియా పోస్ట్ చర్చకు దారి తీసింది. ఓ గ్లామరస్ ఫోటో షూట్
ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన
రష్మీ గౌతమ్… కొత్త జ్ఞాపకాలకు… కొత్త ఆరంభం, అనే కామెంట్స్ జోడించింది. దీంతో
రష్మీ పెళ్లి గురించి పరోక్షంగా హింట్ ఇచ్చిందని నెటిజెన్స్ భావిస్తున్నారు.
పెళ్లి చేసుకోబోతున్నారా? అబ్బాయి ఎవరు? అని కామెంట్స్
పెడుతున్నారు.
పెళ్లి కాకుంటే
రష్మీ ప్రేమలో పడి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా
రష్మీ గౌతమ్ పోస్ట్ వెనుక ఆంతర్యం తెలియాలంటే.. కొన్నాళ్ళు వేచి చూడాలి. లేదంటే ఆమె నోరు విప్పాలి. ప్రస్తుతం
రష్మీ జబర్దస్త్,
శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక
జబర్దస్త్ యాంకర్ అయ్యాక
హీరోయిన్ గా
సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలన్న కల కూడా నెరవేరింది. కెరీర్ బిగినింగ్ లో
రష్మీ సపోర్టింగ్ రోల్స్ చేసింది. చిన్నాచితకా చిత్రాల్లో
హీరోయిన్ గా నటించినా ఆ చిత్రాలు జనాల్లోకి వెళ్ళలేదు. ఒక దశలో రష్మీకి ఆఫర్స్ క్యూ కట్టాయి.
రష్మీ ప్రధాన పాత్రలో పలు చిత్రాలు విడుదలయ్యాయి...!!