'మహేంద్రగిరి వారాహి ' కోసం రిస్క్ చేసిన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి... డాక్టర్లు చెప్పిన వినలేదా..?

Divya

సినిమా మీద పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చి స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది తమను తాము స్టార్ డైరెక్టర్లుగా, స్టార్ హీరోలుగా మార్చుకుంటుంటే, మరి కొంతమంది మాత్రం ఇక్కడ అవకాశాలు లేక ఒకవేళ అవకాశాలు వచ్చిన వాటితో ప్రయోజనం లేక ఇండస్ట్రీ నుంచి ఫేయిడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది మాత్రం ఎన్ని అవాంతరాలు ఎదురైన సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అనే ఒక దృఢ సంకల్పాన్ని పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.ఇక ఇదిలా ఉంటే సుమంత్ హీరోగా సుబ్రహ్మణ్యపురం సినిమాతో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని సంపాదించుకున్న దర్శకుడు జాగర్లపూడి.. ఆయన తనదైన రీతిలో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

ఇక ప్రస్తుతం అమ్మవారి మహత్యాన్ని తెలియజేసేలా 'మహేంద్రగిరి వారాహి' అనే ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాల నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూసేలా చేస్తుంది. ఇక ఇలాంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ సినిమాని చాలా తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా రామచంద్రపురం కోటలో కొన్ని సీన్స్ ని తెరకెక్కించాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇక దానికి తగ్గట్టుగానే సినిమాకు సంబంధించిన షెడ్యూల్ మొత్తం ప్లాన్ చేసిన తర్వాత మూడు రోజుల్లో సినిమా షూట్ కి వెళ్ళాలి అనుకునే సమయంలో డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి కి కార్ యాక్సిడెంట్ అయింది. దాని వల్ల ఆయన కాలుకి చాలా బలమైన గాయమైతే తగిలింది. దాంతో నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాడు. మరి ఇలాంటి పరిస్థితిలో వేరే దర్శకుడు ఉంటే షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేయామని చెప్పి కావాలంటే షెడ్యూల్ ని మరో 20 రోజుల తర్వాత పెట్టుకోమని చెప్పేవాడు. కానీ ప్రొడ్యూసర్ అప్పటికే విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నాడు,ఆర్టిస్టులు కూడా వాళ్ళ డేట్స్ ని కేటాయించారు.

కాబట్టి ఈ పరిస్థితిలో తన ఒక్కడి వల్ల సినిమా షూటింగ్ ఆగిపోకూడదు అని ఆలోచించిన సంతోష్ జాగర్లపూడి డాక్టర్లు చెప్పిన వినకుండా చాలా రిస్క్ చేసి మరి ఔట్ డోర్ షూట్ కి వెళ్లి సినిమా షూట్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడు. ఆయన చేసేది రిస్క్ అని  తెలిసిన సినిమాకి అంతరాయం కలగకూడదనే ఒకే ఒక ఉద్దేశ్యం తో యధావిధిగా సినిమా షూటింగ్ నడిపించమని ప్రొడ్యూసర్ కి భరోసా ఇచ్చి అతి కష్టం మీద రామచంద్రపురం వెళ్లి వారం రోజుల పాటు అక్కడే ఉండి షూటింగ్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడు. నిజానికి కాలు నొప్పిగా ఉన్నప్పుడు ఆ బాధను భరించడమే చాలా కష్టం గా ఉంటుంది.

అలాంటిది ఆ బాధలో కూడా క్రియేటివిటీని వాడి సినిమా షూటింగ్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. చిన్న గాయం తగిలితేనే దాదాపు మూడు నుంచి నాలుగు రోజులపాటు రెస్ట్ తీసుకునే ఈ రోజుల్లో కాలికి తగిలిన గాయాన్ని సైతం పక్కన పెట్టేసి సినిమా కోసం పరుగులు తీశాడు అంటే ఆయనకి సినిమా అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ క్రమంలోనే 'మహేంద్రగిరి వారాహి' సినిమాని సూపర్ సక్సెస్ గా నిలిపి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంటానని దర్శకుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: