డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చాలా డిఫరెంట్.. అందరిలో కెల్లా ఈయన ఆలోచనలు సినిమాలు వెరైటీగా ఉంటాయి.ఇక రామ్ గోపాల్ వర్మని తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే ఆయన అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీశారు. ఇప్పటికే కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసినా కూడా రామ్ గోపాల్ వర్మ అంటే ఎంతో మంది అభిమానులకు ఇష్టం. అయితే అలాంటి రామ్ గోపాల్ వర్మ ఎంతోమంది హీరోయిన్లపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. తాజాగా ఓ హీరోయిన్ పై రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ నెట్టింట ఉంటే వైరల్ అవుతున్నాయి. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు ఐశ్వర్యరాయ్.. ఆర్జీవికి ఐశ్వర్య ప్రెగ్నెంట్ అవ్వడం అస్సలు నచ్చలేదట. అయితే అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకున్నాక ఐశ్వర్య ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి నేరుగా ఐశ్వర్య రాయ్ కి ఓ పెద్ద మెసేజ్ పెట్టాడట. నీలాంటి అందమైన అమ్మాయిలు హాట్ హీరోయిన్స్ ప్రెగ్నెంట్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు.
ఎందుకంటే ప్రెగ్నెంట్ అయితే వాళ్ల షేప్స్ అన్ని పోతాయి. అందుకే ఇలాంటి హాట్ హీరోయిన్లు పిల్లల్ని కనడం నాకు ఇష్టం ఉండదు.అసలు చాలామంది అమ్మాయిలు అంటే పిల్లల్ని కనేవారి లాగానే చూస్తారు. కానీ అది నాకు ఇష్టం ఉండదు. అమ్మాయిని కేవలం పిల్లల్ని కనడానికే అని చూడకూడదు. అందమైన హాట్ బ్యూటీస్ పిల్లల్ని కనడం వల్ల వారి అందం మొత్తం పోతుంది. పిల్లల వల్ల వారి అందం మీద ఎఫెక్ట్ పడుతుంది. పిల్లలు వారి అందాన్ని చెడగొడుతూ ఉంటారు.అందుకే హాట్ బ్యూటీలు పిల్లల్ని కనడాన్ని నేను ఇష్టపడను.
అయితే మీకు పిల్లల్ని కనడం ఇష్టమైతే నేను కూడా ఇష్టం ఉన్నట్టే నటిస్తాను ... అంటూ ఐశ్వర్య రాయ్ కి ఒక పెద్ద మెసేజ్ పెట్టారట రాంగోపాల్ వర్మ. ఇక రాంగోపాల్ వర్మ పెట్టిన మెసేజ్ కి ఐశ్వర్య సైతం ఐ లవ్ యు టూ రాము అంటూ స్పందించిందట. అయితే ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు. హాట్ బ్యూటీస్ అయితే పిల్లల్ని కనకూడదని ఏదైనా రూల్ ఉందా.. ఆడవాళ్ళకి పిల్లల్ని కంటేనే పరిపూర్ణత వస్తుంది అనే విషయం మీకు తెలియదా.. ఆడవాళ్లు అంటే నీ అవసరానికి వచ్చే వాళ్లు కాదు పిల్లల్ని కంటేనే వారి జన్మ పరిపూర్ణమవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.