కొన్ని సంవత్సరాల క్రితం దిల్ రాజు ఎక్కువ శాతం కొత్త దర్శకులతో సినిమాలను తెరకెక్కించే అద్భుతమైన సక్సెస్ లను అందుకున్నాడు. దిల్ రాజు ఎవరైనా దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు అంటే ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అనేంత స్థాయిలో ఆయన గుర్తింపును సంపాదించుకున్నాడు. అందుకు ప్రధాన కారణం ఇదేనా బ్యానర్లో రూపొందిన ఆర్య మూవీ తో సుకుమార్ దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. భాస్కర్ "బొమ్మరిల్లు" సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి ఎదిగాడు.
వంశీ పైడిపల్లి మున్నా సినిమాతో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టి ఆయన కూడా టాప్ దర్శకుడు స్థాయికి చేరుకున్నాడు. వేణు శ్రీరామ్ కూడా ఈ బ్యానర్ లోనే మొదటి సినిమా చేసి ప్రస్తుతం అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇలా ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన దిల్ రాజు ఇప్పటివరకు కొరటాల శివ తో సినిమా చేయలేదు. దానితో ఒకానొక ఇంటర్వ్యూ లో దిల్ రాజు కు మీరు చాలా మంది దర్శకులను పరిచయం చేశారు. కొరటాల శివ కూడా కొంత కాలం క్రితమే దర్శకుడు అయ్యాడు. ఆయనతో మీరు ఇప్పటివరకు సినిమా ఎందుకు చేయలేదు అనే ప్రశ్న దిల్ రాజు కు ఎదురయింది.
దీనికి దిల్ రాజు సమాధానం చెబుతూ ... నేను కొరటాల శివ తో మొదటి సినిమానే చేయాల్సింది. ఆయన నాతో కొన్ని కథలను కూడా చెప్పాడు. కానీ అదే సమయంలో యువి క్రియేషన్స్ సంస్థ తో కూడా ఆయన ట్రావెల్ చేశాడు. అదే సమయంలో ఆ బ్యానర్ వారికి ఒక కథ చెప్పడం , అది వారికి బాగా నచ్చడం , ప్రభాస్ కు నచ్చడంతో మిర్చి మూవీ తో ఆయన దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.