కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా బి గోపాల్ దర్శకత్వంలో అల్లరి రాముడు అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నగ్మా కీలకమైన పాత్రలో నటించింది. అప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ లో హీరో గా నటించడం , ఆ సమయంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న బి గోపాల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఇక తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి బి గోపాల్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అల్లరి రాముడు సినిమా సక్సెస్ కాకపోవడానికి గల కారణాలను వివరించాడు. బి గోపాల్ తాజాగా మాట్లాడుతూ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా అల్లరి రాముడు మూవీ ని తెరకెక్కించాను. ఆ సినిమాలో నగ్మా ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఆ సినిమా ఫస్ట్ అఫ్ అద్భుతంగా ఉంటుంది. కానీ సెకండాఫ్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదు. ఆ మూవీ సెకండ్ హాఫ్ వల్లే రిజల్ట్ గొప్పగా రాలేదు.
అందుకే ఆ సినిమా పోయింది. ఇక ఫస్ట్ అఫ్ వరకు మాత్రం ఆ సినిమా సూపర్ గా ఉంటుంది అని బి గోపాల్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కి పరుచూరి సోదరులు రచన అందించగా ... చంటి అడ్డాల ఈ మూవీ ని నిర్మించాడు. ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించిన ఈ మూవీ లో గజాలా కూడా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ 2002 వ సంవత్సరం జూలై 18 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.