అల్లరి నరేష్: ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడా?
తన కెరియర్ ప్రారంభంలో నరేష్ ఓ హీరోయిన్ తో లవ్ ఎఫైర్ నడిపించారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, సీమశాస్త్రి వంటి సినిమాల్లో అల్లరి నరేష్ తో కలిసి హీరోయిన్గా నటించిన ఫర్జానాతో నరేష్ ప్రేమాయణం కొనసాగించాడని అప్పట్లో ఓ వార్త వైరల్ అయింది. అల్లరి నరేష్ కెరీర్ సినిమాల పరంగా అద్భుతంగా కొనసాగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఎంతో బాగుందని, ఇక వరుసగా అల్లరి నరేష్ కు ఫ్లాప్స్ ఎదురవడంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయట.
ఈ విషయం అల్లరి నరేష్ కుటుంబ సభ్యుల వరకు వెళ్లిందట. దీంతో 2017 సంవత్సరంలో విరూపా అనే అమ్మాయితో తన కుటుంబ సభ్యులు వివాహం జరిపించారట. వివాహ అనంతరం అల్లరి నరేష్ ఎలాంటి ఎఫైర్స్ జోలికి వెళ్లలేదట. ప్రస్తుతం అల్లరి నరేష్ ఓవైపు సినిమాలతో, మరోవైపు తన కుటుంబంతో కలిసి హ్యాపీగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.