దేవరకు అక్కడ మాత్రమే రు. 600 కోట్ల టార్గెట్టా... వామ్మో ఇదేంట్రా బాబు.. ?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవర పార్ట్ 1 . అయితే ఈ సినిమా ఈ నెల 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. మొత్తం ఐదు భాషలలో ఈ సినిమా దేవర రిలీజ్ అవుతోంది. ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా గ్లోబలైజ్ అయిపోయిందన్న విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాకి ఫ్యాన్స్ మామూలు గా పెరిగి పోలేదు. అసలు ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమా రిలీజ్ అయితే చాలు ... దేశంతో .. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కోట్లు కాసులు కురిపించే విధంగా మార్కెట్ భారీ స్థాయిలో బిల్డ్ అయిపోయింది మన సినిమా.
ఇండియన్ సినిమా తో పాటు తెలుగు సినిమా పరిధి కూడా బాగా విస్తరించింది. ఇక ఓవర్సీస్ మార్కెట్ కూడా ఇండియన్ సినిమాకి పెద్ద బలంగా మారింది. ముఖ్యంగా అమెరికా తో పాటు జపాన్ - రష్యాలో కొత్త మార్కెట్ ఓపెన్ అయ్యి ఓవర్సీస్ కలెక్షన్లు కుమ్మి కుమ్మి పడేస్తున్నాయి. నాని సరిపోదా శనివారం ఇండియా లో రకరకాల కారణాలతో పడుతూ లేస్తూ థియేటర్లలో రన్ అవుతుంటే... అమెరికా లో ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసి .. ఏకంగా 2 మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది.
ఇక మన హీరోలు కూడా ఓవర్సీస్ మార్కెట్ మీదే బాగా ఆశలు పెట్టుకున్నారు. ఒకప్పుడు ఓవరాల్ కలెక్షన్లు రు. 250 - 300 కోట్ల వరకు ఉండేది. కానీ ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ నుంచే ఆ రేంజ్ లో నెంబర్లు నమోదు అవుతున్నాయి. ఇక దేవర ఓవర్సీస్ ప్రీ సేల్స్ లో దుమ్ము రేపుతోంది. సెప్టెంబర్ 27న రాబోతున్న దేవర అప్పుడే లక్ష డాలర్ల ప్రీ సేల్స్ కి దగ్గరలో ఉంది. దీంతో, దేవర కి ఓవర్సీస్ టార్గెట్ ఈజీగా 600 కోట్లు వస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.