బన్నీ క్రేజ్ ఇది.... అట్టర్ ఫ్లాప్ అయినా 175 రోజులు ఆడింది?

Veldandi Saikiran

అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదన్న సంగతి తెలిసిందే. అతి చిన్న వయసులోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు తిరగరాస్తుంది. గత రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమాకు తగ్గేదేలేదంటూ ఇండియానే షేక్ చేసింది.

ఇక పుష్పటు సినిమా కోసం ప్రతి ఒక్క సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లు, అల్లు అర్జున్ లుక్, హల్చల్ చేస్తున్నాయి. ఇందులో అల్లు అర్జున్ లుక్ అమాంతం ఈ సినిమాను మరో రేంజ్ కు తీసుకువెళ్లిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  ఇదిలా ఉండగా.... అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభంలో గంగోత్రి, ఆర్య, బన్నీ చిత్రాలు చేశారు.

నాలుగో సినిమాగా తన సొంత బ్యానర్ లో జెనీలియా కథానాయికగా కరుణాకర్ దర్శకత్వంలో హ్యాపీ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయ్యింది. డబ్బులు కూడా రికవరీ చేయలేదు. ఆ సినిమాలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. లాభాలు కూడా రాని ఈ సినిమాను మలయాళంలో డబ్బింగ్ చేసి విడుదల చేయగా... అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా ఈ సినిమా 175 రోజులు ఆడింది. ఈ సినిమా నుంచి మలయాళంలో బన్నీ ట్రెండ్ కొనసాగితోంది.

హ్యాపీ సినిమా చేసిన తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బన్నీ, దేశముదురు, పరుగు, ఆర్య 2 సినిమాలు చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన వరుడు దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాను మలయాళంలోకి డబ్ చేసి విడుదల చేయగా.... ఏకంగా 100 రోజులు ఆడి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అల్లు అర్జున్ నటించిన ప్రతి సినిమా ఖచ్చితంగా మలయాళంలో డబ్ అవడమే కాకుండా ఘన విజయాలను సొంతం చేసుకుంటుంది. ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ బన్నీ క్రేజ్ అసలు తగ్గేదేలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: