ఇంద్ర సినిమా బ్లాక్‌బస్టర్ వెనక బాలయ్య... చిరు చెప్పిన సీక్రెట్..!
ఇక తెలుగు సినిమా రంగంలో ఫ్యాక్షన్ సినిమాలకు మూలంగా నిలిచింది బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమా. 1999 సంక్రాంతి కానుకగా చిరంజీవి నటించిన స్నేహం కోసం సినిమాకు పోటీగా సమరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయింది. ఆ రోజుల్లోనే 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సమరసింహారెడ్డి చాలా కేంద్రాలలో 175 రోజులు ఆడడంతో పాటు కొన్ని కేంద్రాల్లో రెండు వందల రోజులు కూడా ఆడింది. తెలుగు సినిమా చరిత్ర లో అప్పటివరకు ఉన్న చాలా రికార్డులకు సమరసింహారెడ్డి చెదలు పట్టించేసింది ఆ తర్వాత బాలయ్య వెంటనే రెండేళ్ల గ్యాప్లో మరోసారి 2000 నరసింహనాయుడు సినిమా చేసి మరోసారి సూపర్ డూపర్ హిట్ కొట్టారు.
ఆ టైంలో చిరంజీవిపై కూడా ఓఫ్యాక్షన్ యాక్షన్ సినిమా చేయాలన్న ఒత్తిళ్లు అభిమానుల నుంచి ఉన్నాయి. ఈ క్రమంలోనే బాలయ్యకు సమరసింహారెడ్డి - నరసింహనాయుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన అదే బి.గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి ఇంద్ర సినిమా చేశారు. 122 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఎన్ని సంవత్సరాలకు చిరంజీవి తాను ఇంద్ర సినిమా చేయడానికి బాలయ్య సమరసింహారెడ్డి స్ఫూర్తి అని చెప్పటం విశేషం.