'బాలయ్య.. బాలయ్య..' అంటూ హిట్ పెయిర్ గా నిల్చిన బాలయ్య-విజయశాంతి కాంబినేషన్...!

FARMANULLA SHAIK
* పదిహేడు సినిమాలతో హిట్ పెయిర్ గా గుర్తింపు.!
* 'కధనాయకుడు' టూ 'నిప్పురవ్వ' పదేళ్ల ప్రయాణం.!
* 'రౌడీ ఇన్స్పెక్టర్' మూవీలో విజయశాంతికు అండగా నిల్చిన బాలయ్య.!


తెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్యబాబుకున్న క్రేజ్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆ పేరు వింటేనే అటు మాస్ ఇటు క్లాస్ అభిమానులు అని తేడా లేకుండా అందరి చేత ఆదరించబడిన నటుడు నందమూరి బాలకృష్ణ.1990 లలో ఆయన సినిమాలు అప్పటి తరం వారికీ ఆడ, మగ అనే తేడా లేకుండా థియేటర్ ల వైపు పరుగులు పెట్టించి అప్పట్లో క్లాస్ మాస్ అభిమానులను దగ్గర చేసాయి. ఆ టైములో బాలయ్య బాబుకు సరిజోడుగా ఎందరో హీరోయిన్లు చేసినప్పటికి బాగా గుర్తింపు తెచ్చేపెట్టిన పెయిర్ ఎవరైనా ఉంది అంటే అది బాలయ్య-విజయశాంతి అనే చెప్పాలి.వారిద్దరిది ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ గా గుర్తింపు ఉంది. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు తొంభై శాతం హిట్స్ గా నిల్చాయి.మొత్తం వీరి కాంబోలో 17సినిమాలు చేయగా 16 సినిమాలు హిట్స్ మరియు అవేరేజ్ గా నిలవగా ఒక్క సినిమా మాత్రం డిసస్టర్ గా నిల్చింది. 90'స్ లో వీరి కాంబోలో సినిమా వస్తుంది అంటే అభిమానులకి పండగే అని చెప్పాలి.ముఖ్యంగా నిర్మాతలు చాలా ప్రశాంతంగా ఉండి హిట్ గ్యారెంటీ అనే లెక్కల్లో కనబడేవారు.ముఖ్యంగా వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మామయ్య,, మువ్వగోపాలుడు,లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్లోని పాటలు సైతం అప్పట్లో ఒక సంచలనం. అయితే ముఖ్యంగా రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో 'టక్కు టమారా బండి' పాట షూటింగ్ అయిపోయిన తర్వాత విజయశాంతికీ అభిమానులకి మధ్య వచ్చిన ఒక పెద్ద ఇష్యూను బాలయ్య బాబు సామరస్యంగా చక్కదిద్దారని విజయశాంతి గారు ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు.
బాలయ్య బాబు సోలో హీరోగా ఇన్నింగ్స్ ప్రారంభించే సమయానికి విజయశాంతి వర్తమాన హీరోయిన్ గా గుర్తింపు ఉంది.విరిద్దరి కాంబినేషన్ 1984 లో 'కధనాయకుడు' మూవీతో మొదలై ఆ సినిమా హిట్ గా నిల్చింది.అప్పటి నుండి వీరి కాంబోలో ప్రతియేడాది రెండు చిత్రాలు వచ్చేవి.రెండో సినిమాగా బాలయ్య సొంత బ్యానర్లో వచ్చి రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చిన ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు.అలాగే మూడు కేంద్రాల్లో 365 డేస్ ఆడిన సినిమాగా 'ముద్దుల కృష్ణయ్య ' నిల్చింది.'సాహస సామ్రాట్' సినిమా అనేది టైటిల్ పరంగా ఒక పెద్ద వివాదంగా మారింది చివరికి ఆ మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.అలాగే ముద్దుల మావయ్య మూవీలో బాలయ్య బాబు చేసిన బ్రేక్ డాన్స్ అప్పట్లో ఒక సంచలం సృష్టించాయి.బి.గోపాల్ డైరెక్షన్లో మొదటి సారి వచ్చిన సినిమా లారీడ్రైవర్ బాలయ్య బాబు కూతురు బ్రాహ్మిని జన్మదినం సందర్బంగా విడుదల అయి అఖండ విజయం సాధించింది.రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో విజయశాంతి మాస్ క్యారెక్టర్తో సోలోగా రెండు ఫైట్ సిన్స్ ఉండగా మేకర్స్ మూవీ నీడివి ఎక్కువగా ఉందని ఒక ఫైట్ సీన్ తీసేద్దాం అనుకుంటే దానికి బాలయ్య బాబు ఒప్పుకోలేదు. దాంతో బాలయ్య పై ఇంకా అభిమానం పెంచుకుంది లేడీ సూపర్స్టార్ విజయశాంతి.
అయితే అప్పట్లో విజయశాంతి నోటి వెంట బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య  జో కొట్టాలయ్య అని  వస్తే..స్టేట్ మొత్తం పూనకంతో ఊగిపోయింది.అంతటి శక్తీ ఉన్న వీరి కాంబోలో రెండు దశాబ్దాల నుండి సినిమాలు ఆగిపోడానికి ఒకానొక టైములో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు నోరు విప్పారు.బాలయ్య పక్కన  హీరోయిన్ గా  ఉంటే విజయశాంతే  ఉండాలి..విజయశాంతి కి హీరోగా బాలయ్యే ఉండాలి. ఇది నిజమని ఆ ఇద్దరు కలిసి చేసిన సినిమాలు చూస్తే చెప్తారు.అసలు విషయానికి వస్తే బాలయ్య, విజయశాంతి కాంబోలో చివరిగా వచ్చిన సినిమా నిప్పు రవ్వ. 1993 లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత  ఎలాంటి సినిమా తెరకెక్కలేదు. అభిమానులతో పాటు ప్రేక్షకులు రకరక కారణాలు చెప్పారు. కానీ ఇప్పుడు విజయ శాంతే అసలు నిజం చెప్పింది.బాలకృష్ణగారితో  నిప్పురవ్వ  తరువాత చెయ్యక పోవడానికి ప్రత్యేక  కారణమంటూ ఏమీ లేదు.  ఆ మూవీ తర్వాత  లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యాల్సి వచ్చింది. వరుసగా అలాంటి సినిమాలే వచ్చాయి.నేను కూడా సైన్ చేసుకుంటూ వెళ్ళాను. పైగా ఒక దానిని మించి ఒకటి విజయం సాధించాయి.  అది ఎంతలా అంటే హీరో స్థాయి సినిమాలతో సమానంగా ఆడేవి.లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరో ఇమేజ్ వస్తుందనీ, దాంతో  యాక్షన్ సినిమాలు చేసుకుంటూ వెళ్తానని , అంత బిజీ అవుతానని కూడా అనుకోలేదు. అందువల్లనే బాలకృష్ణ తో గాని ఇతర హీరోలతో గాని  చేయలేకపోయాను అని చెప్పుకొచ్చింది.దాంతో వీరి కాంబోను ఇష్టపడే అభిమానులు బాలకృష్ణ గారు ద్విపాత్రాభినయం మూవీ చేయాలనీ దాంట్లో సీనియర్ బాలయ్య బాబుకు జోడిగా విజయశాంతి చేయాలనీ కోరుతున్నారు.ఏదేమైనా వీరి కాంబినేషన్ అనేది నేటికీ కూడా బుల్లితేర అభిమానులను అలరిస్తుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: