డార్లింగ్ ప్రభాస్ కు.. ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్ ఏంటో తెలుసా?

praveen
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హీరో ఎవరు అంటే అందరూ కూడా ప్రభాస్ పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే చాలు వందల కోట్ల బడ్జెట్ కావాల్సిందే. ఇక ప్రభాస్ ఒక్కో సినిమాకి 150 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన చిత్రాలు వందల కోట్ల వసూళ్లు రాబడుతూ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అంతేకాదు మినిమం గ్యారంటీ మూవీలుగా మారిపోతున్నాయి అని చెప్పాలి

 కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో సైతం ప్రభాస్ కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో సందేహం లేదు. అయితే కేవలం సినిమాలతో మాత్రమే కాదు తన వ్యక్తిత్వంతో కూడా ప్రభాస్ ఎంతో మంది అభిమానుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్వం ఆయనది. గత కొంతకాలం నుంచి వరుసగా సూపర్ హిట్ లు కొడుతూ దూసుకుపోతున్నాడు. సలార్ అనే మూవీతో హిట్టు కొట్టిన ప్రభాస్ మొన్నటికి మొన్న కల్కి మూవీతో ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. 1200 కోట్ల వసూళ్లు సాధించింది ఈ మూవీ.

 ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ అనే మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ప్రభాస్ ప్రొఫెషనల్ విషయాలు దాదాపు అభిమానులకు తెలుసు. కానీ వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకునేందుకు అభిమానులు కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నార్మల్ గానే ప్రభాస్ మంచి ఆహార ప్రియుడు అన్న విషయం తెలిసిందే. ప్రభాస్ తనకోసం ప్రత్యేకంగా ఒక చెఫ్ టీం ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభాస్ ఇంట్లో ఓ నాన్ వెజ్ ఐటమ్ అంటే డార్లింగ్ కి బాగా ఇష్టమట. బెండకాయ పచ్చి రొయ్యల పులుసు అంటే పడి చచ్చిపోతాడట ప్రభాస్. తన ఇంటికి వచ్చిన అతిథులు అందరికీ కూడా తప్పకుండా ఆ వంటకం రుచి చూపిస్తాడట. రొయ్యల పులావ్ కూడా ప్రభాస్ ఇష్టంగా తింటారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: