ప్రభాస్ తనతో ఆ సినిమా రీమేక్ చేయమన్నాడు.. సందీప్ రెడ్డి కామెంట్స్ వైరల్?
ఇక ఇప్పుడు రాజా సాబ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు ప్రభాస్. అయితే డార్లింగ్ ఫ్యూచర్ లైన్ అప్ కూడా భారీగానే ఉంది. ఈ లైన్ అప్ లో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు. కానీ ప్రేక్షకులందరూ ఎదురుచూసే మూవీ మాత్రం స్పిరిట్ సినిమా గురించే. ఎందుకంటే ఈ సినిమాకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పటివరకు ఈయన తీసింది కేవలం మూడే మూడు సినిమాలు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో ఈయన పేరు మారుమోగిపోయింది. అందరిలా కాకుండా సరికొత్త రీతిలో సినిమాలను తీసి హిట్టు కొట్టడంలో సందీప్ రెడ్డి వంగ దిట్ట.
అయితే సందీప్ రెడ్డి వంగ సినిమాలో ప్రభాస్ ఏకంగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలియడంతో ఈ సినిమా మొదలవ్వకముందే అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి ప్రభాస్తో మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. యానిమల్ మూవీ కంటే ముందు ప్రభాస్ నన్ను పిలిచి ఒక హాలీవుడ్ రిమేక్ సినిమా చేద్దామని చెప్పారు. కానీ అది నాకు వర్కౌట్ అవ్వదు. కావాలంటే నాకు కొంచెం టైం ఇవ్వండి. మీకు సెట్ అయ్యే కథను తీసుకువస్తా అని చెప్పాను. కరోనా సమయంలో యానిమల్ రాసుకుంటున్నప్పుడు ఒక ఆలోచన వస్తే దాన్ని రాసుకొని ప్రభాస్ ను కలిసి వినిపించ.. వెంటనే సినిమా చేద్దాం అన్నారు. ఆ సినిమానే స్పిరిట్ అంటూ సందీప్ రెడ్డి చెప్పుకొచ్చాడు.