అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మొదట ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాను ఆ తేదీన కాకుండా డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ మరో విడుదల తేదీని ప్రకటించారు. ఇకపోతే డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయడం వల్ల ఈ సినిమాకు వేరే సినిమాల నుండి పెద్దగా పోటీ లేదు. దాదాపు రెండు వారాల పాటు ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమాతో పోటీ ఉండే అవకాశం లేదు.
దానితో ఈ మూవీ రెండు వారాల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంది. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ కి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ప్రమాదమే ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మూవీ ని డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ బృందం వారు ప్రకటించారు. ఇక డిసెంబర్ 20 వ తేదీన అనేక హాలీవుడ్ సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఇక హాలీవుడ్ సినిమాలతో పోటీపడి ఓవర్సీస్ మార్కెట్లో భారీ కలెక్షన్లను వసూలు చేయడం ఈ సినిమాకు కష్టం అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే సూరి , విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వెట్రి మారన్ దర్శకత్వంలో రూపొందుతున్న విడుదల పార్ట్ 2 మూవీ ని కూడా డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ద్వారా గేమ్ చేంజర్ కి తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇలా గేమ్ చేంజర్ మూవీ కి చాలా సినిమాల నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఈ గట్టి పోటీని తట్టుకొని ఈ సినిమా ఏ స్థాయిలో నిలబడుతుందో చూడాలి. గేమ్ చేంజెర్ మూవీకి అనేక సినిమాలతో పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉండడంతో ఈ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఇంత రిస్క్ ఉన్న విడుదల తేదీని ఎందుకు డిసైడ్ చేసుకున్నాడా అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.