నందమూరి నటసింహం
బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో "N B K 109" అనే వర్కింగ్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ ఈ
మూవీ విడుదల తేదీని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను ఈ సంవత్సరం
డిసెంబర్ నెలలో కానీ , వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా కాని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ చిత్రీకరణ జరుగుతున్న సమయం లోనే
బాలయ్య ,
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2
మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే "N B K 109"
సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే
బాలయ్య అఖండ 2 చిత్ర షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ
సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ
మూవీ ని 2025
డిసెంబర్ 2 వ తేదీన గాని , లేదంటే 2026 వ సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా గానీ విడుదల చేసే ఆలోచనలు ఈ
మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. దీనితో
బాలయ్య అభిమానులు "N B K 109"
సినిమా వచ్చిన చాలా తక్కువ కాలానికే అఖండ 2
సినిమా కూడా రాబోతుంది అని
ఖుషి అయ్యారు.
కాకపోతే అఖండ 2
సినిమా విడుదలకు సంబంధించి వచ్చిన వార్తలు అన్ని అవాస్తవం అని తెలుస్తుంది. ఎందుకు అంటే అఖండ 2
మూవీ ని
డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఆ తేదీ మంగళవారం వస్తుంది. దాదాపు స్టార్ హీరోలు నటించిన ఏ సినిమాను మంగళవారం విడుదల చేయరు. ఇక
సంక్రాంతి కి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు అనే వార్త కూడా అవాస్తవం అని తెలుస్తుంది. ఇలా ఈ
సినిమా విడుదలకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు అవాస్తవం అని తెలుస్తుంది.