తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ నిన్న అనగా ఆగస్టు 29 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 4.16 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.22 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.15 కోట్లు , ఈస్ట్ లో 47 లక్షలు , వెస్ట్ లు 45 లక్షలు , గుంటూరులో 52 లక్షలు , కృష్ణ లో 60 లక్షలు , నెల్లూరులో 35 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా రెండు రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.92 కోట్ల షేర్ , 13.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి రెండు రోజుల్లో కర్ణాటక , తమిళనాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 2.15 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్సీస్ లో 5.65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా రెండు రోజులకు గాను ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.72 కోట్ల షేర్ , 30.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
ఇక ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ మరో 25.28 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఈ మూవీ లో నాని కి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటించగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. డి వి వి దానయ్య ఈ మూవీ ని నిర్మించాడు.