పుష్ప 2 ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆగిన షూటింగ్..!

Divya
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప -2 సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉన్నది. ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ని సైతం షూట్ చేస్తున్నామని అల్లు అర్జున్ స్వయంగా తెలియజేశారు. డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని చెప్పడంతో శరవేగంగా చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందట. నిన్నటి రోజున పుష్ప సినిమా నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ .. నవంబర్ కల్లా పుష్ప-2 సినిమా సిద్ధమవుతుందని తెలియజేశారు.

కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప-2 సినిమా షూటింగ్ ఆగిపోయిందట. అందుకు కారణం డైరెక్టర్ సుకుమార్. ఎందుకంటే సుకుమార్ కు తీవ్రమైన జ్వరం రావడంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సుకుమార్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ ఉండడం చేత ఈ సినిమా షూటింగ్ బ్రేక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన షూటింగ్ని సెప్టెంబర్ మూడవ తేదీన మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికే పుష్ప -2 వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్న సమయంలో ఇలా సుకుమార్ కు జ్వరం రావడంతో బన్నీ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు.


అల్లు అర్జున్ మాత్రం ఏది ఏమైనా డిసెంబర్ 6వ తేదీన రాబోతున్నామంటూ తెలియజేశారు.. అల్లు అర్జున్ అభిమానులైతే సుకుమార్ త్వరగా కోలుకొని సినిమానీ సుకుమార్ పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. మరి సుకుమార్ కు జ్వరం వస్తుందన్న వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది. పుష్ప-2 లో కేవలం ఇప్పటికీ రెండు పాటలు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండు పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ మరొకసారి తన స్టామినాతో అందిస్తున్నారు. ముఖ్యంగా పుష్ప-2 లో స్పెషల్ సాంగ్ కి భారీ క్రేజ్ ఏర్పడేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: