భార్య కోసం నితిన్ సంచలన నిర్ణయం..సినిమాలకు గుడ్‌ బై ?

Veldandi Saikiran
టాలీవుడ్‌ స్టార్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన హిట్స్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. నితిన్ హీరోగా వెండితెరపై అడుగుపెట్టి ఇప్పటికి 22 ఏళ్లు పూర్తయింది. జయం సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. నితిన్ తన కెరీర్ లో త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, రాజమౌళి వంటి ఎందరో స్టార్ డైరెక్టర్లతోనూ, దర్శకులతో సినిమాలను చేశాడు.
వరుసగా ఫ్లాప్స్ తో నితిన్ కెరియర్ ముగిసిపోయిందనే సమయానికి మళ్లీ సూపర్ హిట్ సినిమాలతో కం బ్యాక్ అయ్యాడు నితిన్. దిల్, సై, అ ఆ, శ్రీ ఆంజనేయం వంటి డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ అందుకున్నాడు నితిన్‌. వరుసగా నితిన్ 12 ఫ్లాప్స్ సినిమాలను ఎదుర్కొన్నాడు. ఇండస్ట్రీలో నితిన్ కెరీర్ అయిపోయిందనే కామెంట్స్ కూడా ఎన్నో వినిపించాయి. అయితే అప్పుడే ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సూపర్ హిట్ సినిమాలతో తన సత్తాను చాటుకున్నాడు.

ఇదిలా ఉండగా....నితిన్ ప్రస్తుతం సినిమాల షూటింగ్ నుంచి రెండు నెలల పాటు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాడట. నితిన్ 2020లో షాలిని కందుకూరిని వివాహం చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. ఇద్దరు హ్యాపీ లైఫ్ కొనసాగిస్తున్నారు. అయితే కొంతకాలం క్రితం శాలిని గర్భవతి అయిందట. ఆమెకి సెప్టెంబర్ లో డెలివరీ డేట్ ఇచ్చారట.
దీంతో రెండు నెలలపాటు తన భార్యతో టైమ్ స్పెండ్ చేసేందుకు షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారట. డెలివరీ తర్వాత బేబీతో పాటు తన భార్యతో టైమ్ స్పెండ్ చేయాలని నితిన్ భావిస్తున్నారట. అందుకే షూటింగ్స్ కి కొంతకాలం బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పటికే ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: