పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ హీరోగా
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన
కల్కి 2898 ఎడి
సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇందులో దిశా పటాని, దీపికా పదుకొనె, కమల్ హాసన్,
అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్రలలో నటించారు. అయితే ప్రేక్షకులు అంతా ఇప్పుడు దాని రెండో భాగం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా
కల్కి 2898 ఎడి
సినిమా కేవలం ఒక
సినిమా మాత్రమే కాదు ఇది ఒక యూనివర్స్.
కల్కి 2 ఈ యూనివర్స్‌ను మరింత విస్తరిస్తుందని అంచనా. ఇప్పటికే విడుదలైన మొదటి భాగం క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్‌లు
కల్కి 2 పై అంచనాలను మరింత పెంచాయి.
అయితే మొదటి
సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత
నిర్మాత అశ్వినీదత్ పార్ట్ 2 షూటింగ్ చాలానే పూర్తయ్యింది రిలీజ్ కూడా అతి త్వరలోనే ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు తన యంగ్
ప్రొడ్యూసర్ స్వప్న దత్ ఈ
సినిమా పై మరింత క్లారిటీ ఇచ్చారు.
కల్కి పార్ట్ 2 చిత్రీకరణ దాదాపు వచ్చే ఏడాదిలో స్టార్ట్ అవుతుంది అని అక్కడ నుంచి మొదలై సినిమాని 2028లో రిలీజ్ కి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నట్టుగా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఈ వార్త విన్న అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉంటే
కల్కి పాన్
ఇండియా హిట్ తర్వాత ప్రభాస్
వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ది
రాజా సాబ్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ
మూవీ నిధి అగర్వాల్,
మాళవిక మోహనన్ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇకపోతే ఈ
మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ కీలక షెడ్యూల్ లో
ప్రభాస్ తన పార్ట్ ను పూర్తి చేసినట్లు తాజా సమాచారం. ఇప్పటికే ఈ
సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లీంప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పాన్
ఇండియా స్టార్ ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి మరి.