మాలీవుడ్లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది ఏంటి అంటే హేమ కమిటీ.. ఎంతోమంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక ఆరోపణలను బయటపెడుతున్నారు. అయితే డైరెక్టర్ రంజిత్ పై నటిమణి సజీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాజాగా సజీర్ నా నగ్న ఫోటోలు డైరెక్టర్ రంజిత్ ఆ హీరోయిన్ ఫోన్ కి పంపించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆ హీరోయిన్ తో డైరెక్టర్ రంజిత్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సజీర్ తాజాగా మాట్లాడుతూ.. నేను షూటింగ్ చూడడానికి వెళ్ళినప్పుడు ఏదైనా అవకాశం ఉందా అని డైరెక్టర్ ని అడిగాను.ఆయన నాకు ఓ టిష్యూ పేపర్ మీద నెంబర్ రాసిచ్చి హోటల్ కి రమ్మని చెప్పారు. అయితే ఆ హోటల్ కి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి అవ్వడంతో హోటల్స సిబ్బంది నన్ను లోపలికి రానివ్వలేదు.
కానీ డైరెక్టర్ రంజిత్ చెప్పడంతో నేను వెనక డోర్ నుండి వచ్చి ఆయన రూమ్ లోకి వెళ్ళాను. కానీ అప్పటికి ఆయన పీకల్లోతూ వరకు మద్యపానం తాగి ఉన్నారు.దాంతో నాకు కాస్త భయం వేసింది.ఆ తర్వాత నన్ను కూడా డ్రింక్ చేయమని అన్నారు. అయితే నేను అప్పటివరకు ఒక్కసారి కూడా మద్యపానం ముట్టుకోలేదు.నా లైఫ్ లో మొదటిసారి అది కూడా సినిమా అవకాశం కోసం తప్పదు అని డ్రింక్ చేశాను. ఆ తర్వాత మద్యం మత్తులో నేనుండగా రాత్రి మొత్తం ఆ డైరెక్టర్ నన్ను పూర్తిగా లైంగికంగా వాడుకున్నాడు. అంతే కాదు నాకు సంబంధించిన నగ్న ఫోటోలు ఇతర ఫోటోలు అన్ని ఆయన ఫోన్లో బంధించాడు.
అయితే ఈ ఫోటోలన్నీ ఎవరికి పంపిస్తున్నారు అని నేను అడిగితే రేవతికి పంపించాను అని చెప్పాడు. ఆ తర్వాత రేవతికి ఫోన్ చేసి నీ ఫొటోస్ బాగున్నాయని చెప్పింది అని కూడా చెప్పారు. అయితే అటువైపున ఉన్నది రేవతినో లేదో నాకు తెలియదు. కానీ డైరెక్టర్ రంజిత్ మాత్రం రేవతి పేరు చెప్పారు అంటూ నటి సజీర్ సంచలన కామెంట్స్ చేసింది.అయితే అనూహ్యంగా హీరోయిన్ రేవతి పేరు బయటపడడంతో రేవతికి ఆ డైరెక్టర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి.. హీరోయిన్ రేవతి అమ్మాయిల నగ్న ఫోటోలు తీసి అలాంటి పని చేసేదా అంటూ కొంతమంది నెటిజన్స్ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.మరి ఇందులో ఉన్న నిజం ఏంటో తెలియాల్సి ఉంది