ఆలీతో వర్కౌట్ అయింది.. వెంకీ తో ఎందుకు కాలేదు..?

MADDIBOINA AJAY KUMAR
ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరొక భాషలో రీమిక్ చేయడం అనేది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. అలా ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరొక భాషలో రీమిక్ చేసిన సందర్భంలో ఆ సినిమా ఆ భాషలో కూడా కచ్చితంగా సక్సెస్ కావాలి అని రూల్ ఏమీ లేదు. అలా ఒక భాషలో సక్సెస్ అయిన సినిమాలను మరొక భాషలో రీమేక్ చేస్తే అక్కడ బోల్తా కొట్టిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం కమెడియన్ ఆలీ హీరోగా ఇంద్రజ హీరోయిన్ గా తనికెళ్ల భరణి ప్రతి నాయకుడి పాత్రలో ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో యమలీల అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఆ సమయంలో ఈ మూవీ భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ తో హీరో గా ఆలీ కి అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇలా తెలుగు భాషలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళి మోహన రావు దర్శకుడిగా హిందీ లో తక్ దిర్ వాలా అనే పేరుతో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు. ఈ మూవీ లో వెంకటేష్ కి జోడిగా రవీనా టాండన్ హీరోయిన్ గా నటించగా ... ఆనంద్ - మిలింద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇకపోతే తెలుగు లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ మూవీ విడుదల అయిన తర్వాత ఫ్లాప్ తక్ ను తెచ్చుకుంది.

కానీ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను భారీ ఎత్తున నిర్వహించడంతో ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఈ సినిమా కలెక్షన్లు పెరిగాయి. దానితో ఈ మూవీ ఆ తర్వాత పర్వాలేదు అనే కలెక్షన్లను వసూలు చేసి యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇలా ఆలీ హీరోగా యమలీల పేరుతో రూపొంది తెలుగులో సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను హిందీ లో వెంకటేష్ హీరోగా తక్ దిర్ వాలా అనే పేరుతో రీమిక్ చేయగా ఈ సినిమా మాత్రం హిందీ ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: