ఏ సినిమాకైనా ప్రచార చిత్రాలు అనేవి అత్యంత కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. సినిమాపై అంచనాలు లేకపోయినా ఆ మూవీ నుండి మూవీ బృందం వారు విడుదల చేసే టీజర్ , ట్రైలర్ , పోస్టర్లు , పాటల ద్వారా ఆ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక భారీ అంచనాలు ఉన్న సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకున్నట్లయితే ఆ సినిమాపై అంచనాలు క్రమక్రమంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. అదే భారీ అంచనాలు ఉన్న సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉన్నట్లు అయితే ఆ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి.
ఇక ప్రచార చిత్రాలు ఒక రకంగా మేలు చేస్తే మరొక రకంగా హాని కూడా చేస్తాయి. సినిమాపై హైప్ పెంచడానికి మూవీ లో ఏదో కాసేపు ఉండే కంటెంట్ ను ఎక్కువగా సేపు చూపించినట్లు అయితే ప్రేక్షకులు మొత్తం అలాంటి కంటెంట్ సినిమాలో ఉంటుంది అని థియేటర్ కి రావడం , తీరా చూసాక ప్రచార చిత్రాల్లో ఉన్న దానికి సినిమాలో ఉన్న దానికి పొంతన లేకపోవడంతో సినిమా బాగున్న నెగిటివ్ టాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా అల్లు అర్జున్ కెరియర్ లో కూడా ఓ మూవీ కి జరిగింది. అల్లు అర్జున్ కొంత కాలం క్రితం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా ప్రచార చిత్రాలను విడుదల చేసిన సమయంలో ఈ మూవీ లో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు చూపించారు. దానితో ప్రేక్షకులంతా ఈ సినిమాలో అల్లు అర్జున్ మొత్తం బార్డర్ లోనే ఉంటాడు. దేశ సేవ చేస్తాడు అని భావించారు. కానీ సినిమాలో అల్లు అర్జున్ ఒక పాటలో అలాగే కొంత సమయం తప్పితే ఆర్మీ ఆఫీసర్ గా ఉండడు. మామూలు యువకుడి పాత్రలోనే కనిపిస్తాడు. దానితో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ కారణంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.