తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ నాగార్జునే: కృష్ణవంశీ
అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలు మార్చిన ఏకైక హీరో అక్కినేని నాగార్జున అని కృష్ణవంశీ వీడియోలో చెప్పుకొచ్చారు. తెలుగు సినిమాను గ్లోబల్ చేసి ఇతర డైరెక్టర్లను తీసుకొచ్చి సినిమాలు చేసి హీరో అని చాటిచెప్పారు. అప్పట్లో నాగ్ చేసిన సినిమాలు ఆడియన్స్ వ్యూస్‌నే మార్చేశాయని, విజన్‌నే మార్చేశాయని, రామ్ గోపాల్ వర్మను పరిచయం చేయడమే కాకుండా మణిరత్నంను తెలుగులోకి తెచ్చిన ఘనత నాగార్జునకే దక్కుతుందని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు.
ప్రియదర్శన్, ఫాజిల్, రవిచందర్, మహేష్ భట్ లాంటి డైరెక్టర్లను తెలుగు ఇండస్ట్రీకి రప్పించి నాగ్ సినిమాలు చేశారట. మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్ ఇలా అన్ని భాషల డైరెక్టర్లను అప్పట్లోనే తెలుగు చిత్రపరిశ్రమకు తీసుకొచ్చారట. చిన్న క్యారెక్టర్ అయినా ముంబై వెళ్లి చేసి వచ్చేవాడని, అలా పాన్ ఇండియా అనే మాటకు మొదట ఫౌండేషన్ వేసింది మాత్రం కింగ్ నాగార్జుననే అని కృష్ణవంశీ తెలిపారు. ప్రస్తుతం నాగ్ బిగ్ బాస్ సీజన్8 చేయడానికి రెడీ అవుతున్నారు. నా సామిరంగ మూవీతో హిట్ అందుకున్న నాగ్ తన తదుపరి మూవీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నాడు. ఈసారి బిగ్ బాస్ సీజన్‌లో నాగార్జున మరింత ఎనర్జిటిక్‌గా ఉంటారని, కంటెస్టెంట్స్‌ను ఓ ఆట ఆడుకుంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నాగ్‌కు అన్నీ మంచే జరగాలని, ఎవరికి మోసం చేయని ఆయనకు అన్నీ అనుకూలంగా మారాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.