సినిమా ఇండస్ట్రీలో అందరికంటే
నిర్మాత పరిస్థితి దారుణంగా ఉంటుంది అని ఇప్పటికే చాలా మంది సినీ పరిశ్రమకు సంబంధించిన వారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంటే
సినిమా నిర్మాత అనేవాడు ఆ సినిమాను నమ్ముకొని డబ్బులు పెడుతూ వస్తాడు. డబ్బులు పెట్టిన సమయంలో
సినిమా విడుదల అయ్యి మంచి విజయం అందుకుంటూనే అతనికి లాభాలు వస్తాయి. లేని పక్షంలో అతనికి భారీ మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక
సినిమా పరిశ్రమలో ప్రతి సంవత్సరం ఎన్నో వందల సినిమాలు వస్తూ ఉంటే అందులో కేవలం కొన్ని మాత్రమే మంచి విజయాలు సాధిస్తూ ఉంటాయి.
అలా కొన్ని సినిమాల నిర్మాతలకు మాత్రమే మంచి లాభాలు రావడం మిగతా
సినిమా నిర్మాతలకు నష్టాలు రావడం అనేది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. దానితో సినీ పరిశ్రమలో అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొనేది
నిర్మాత మాత్రమే అని చాలా మంది ఇప్పటికే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో పరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్న వారిలో టి జీ
విశ్వ ప్రసాద్ ఒకరు. ఈయన పీపుల్స్
మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. ఈయన ఇప్పటికే చాలా సినిమాలను నిర్మించిన అందులో కొన్ని మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. చాలా
మూవీ లు
బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యాయి.
విశ్వ ప్రసాద్ ప్రస్తుతం
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా
రాజా సాబ్ అనే
మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ
మూవీ కి
మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే
ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రభాస్ నటించిన సినిమాలకు ఈ మధ్య కాలంలో భారీ కలక్షన్లు వస్తున్నాయి. మరి
రాజా సాబ్
మూవీ కి కూడా అలాంటి కలెక్షన్లు వచ్చినట్లయితే ఈ
మూవీ తో
విశ్వ ప్రసాద్ భారీ లాభాలను అందుకునే అవకాశాలు ఉన్నాయి.