సెలబ్రిటీలు వేసుకున్న దుస్తులను వేసుకోవడం, వాళ్ళు వేసుకున్న నెక్లెస్ లు వేసుకోవడం వంటివి సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది.తమ అభిమాని హీరో కొత్త సినిమాలో ఏదైనా వెరైటీ డ్రెస్ వేసుకున్నారంటే వెంటనే అభిమానులు మార్కెట్లో కొత్తగా వచ్చిన ఆ హీరో వేసుకున్న డ్రెస్ ని కొనుగోలు చేయాల్సిందే.ఇక హీరోయిన్లు వేసుకున్న డ్రెస్ లను అమ్మాయిలు ఫాలో అవుతూ ఉంటారు. కేవలం డ్రెస్సులు,నగలు మాత్రమే కాదు వాళ్ళ హెయిర్ కట్ ని కూడా చాలామంది అబ్బాయిలు ఫాలో అవుతారు. అప్పట్లో నటుడు అబ్బాస్ కటింగ్ అంటే కుర్రకారు లో ఎంత క్రేజ్ ఉండేదో చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ స్టైల్ ని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు.ఆయన హెయిర్ కట్,డ్రెస్ ఇలా ప్రతి ఒక్కటి చాలామంది ఆయన అభిమానులే కాదు మామూలు జనాలు కూడా ఫాలో అవుతారు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్, నాచురల్ స్టార్ నాని ఇద్దరు వేసుకున్న ఒక సింపుల్ టీషర్ట్ కి సంబంధించి ఎన్నో ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఎంతో సింపుల్ గా కనిపించే ఆ జంపర్ ధర తెలిస్తే మాత్రం మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. అవును మీరు వినేది నిజమే ..సెలబ్రిటీలు వేసుకునే డ్రెస్సులు చాలా కాస్ట్లీ గా ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే అవి మామూలు జనాలకు అందని ద్రాక్ష గానే ఉంటాయి. అయితే తాజాగా అల్లు అర్జున్, నానీలు వేసుకున్న ఒక జంపర్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక ఆ ఫోటోలు చూసిన అభిమానులు నాని,బన్నీ వేసుకున్న ఆ జంపర్ ధర ఎంత ఉంటుందో అని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు వారిద్దరు వేసుకున్న జంపర్ ధర బయటపడింది.ఇక నాని,బన్నీ ఇద్దరు ఎంతో ఇష్టపడి వేసుకున్న ఆ జంపర్ ఖరీదు అక్షరాల 44,950 అంటే దాదాపు 45,000 అన్నమాట.. అలా ఒక్క జంపర్ ఖరీదే 45వేలా అని చాలామంది ఈ విషయం తెలిసిన వాళ్ళు నోరెళ్లబెడుతున్నారు.. ఇక ప్రస్తుతం నాని సరిపోదా శనివారం మూవీతో మన ముందుకు వచ్చారు.ఈ సినిమా మొదటి షో తోనే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక అల్లు అర్జునేమో పుష్ప-2 క్లైమాక్స్ షూటింగ్లో బిజీగా ఉన్నారు.