నాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ , నాని కి జోడిగా నటించగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ కే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాను ఆగస్టు 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఓ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.
అది ఏమిటి అనుకుంటున్నారా..? కొన్ని సంవత్సరాల క్రితం ప్రియాంక అరుల్ మోహన్ , శివ కార్తికేయన్ హీరో గా ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన డాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ప్రియాంక మోహన్ కు తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు వచ్చింది.
ఇకపోతే నాని హీరో గా ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా రూపొందిన సరిపోదా శనివారం సినిమాలో కూడా ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించాడు. దానితో డాన్ సినిమా సెంటిమెంట్ వర్కౌట్ అయితే సరిపోదా శనివారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకునే అవకాశం ఉంది. ఇకపోతే డాన్ సినిమా తెలుగు లో కాలేజ్ డాన్ పేరుతో విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది.