టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొన్ని సంవత్సరాల పాటు అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగించిన బర్టీలలో రెజీనా ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడం , ఈమె కూడా తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో చాలా తక్కువ కాలంలోనే ఈమె స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమెకు ఆ తర్వాత పెద్ద స్థాయి విజయాలు దక్కకపోవడం వల్ల అవకాశాలు తగ్గాయి. దానితో ఈమె స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లలేకపోయింది.
కానీ ఇప్పటికీ కూడా పర్వాలేదు అనే స్థాయి ఉన్న సినిమాలలో నటిస్తూ కెరియర్ ను బాగానే ముందుకు సాగిస్తుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అందాలను ఆరబోసి తన స్కిన్ షో తో కుర్రకారుని ఆకట్టుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. ఇప్పటికే అనేక సార్లు రెజినా తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈమె అప్పుడప్పుడు తనకు సంబంధించిన క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా రెజీనా గ్రీన్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన గ్రీన్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి క్లాస్ అండ్ రీసెంట్ లుక్ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.