తెలుగు సినీ పరిశ్రమలో మంచి మాస్ ఈమేజ్ కలిగిన హీరోలలో రవితేజ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత సినిమాలో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా కెరియర్ ను కొంత కాలం ముందుకు సాగించిన ఆయన ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకోవడం , ఈయన హీరో గా నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో ఈయన క్రేజ్ వరుసగా పెరుగుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరిగా రవితేజ కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలను అందుకున్న రవితేజ ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాలను అందుకోలేకపోతున్నాడు. సంవత్సరానికి రెండు , మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న అందులో చాలా తక్కువ మాత్రమే విజయాలను సాధిస్తూ వస్తున్నాయి.
దానితో ఈయన కెరీర్ క్రాఫ్ కూడా రోజు రోజుకి పడిపోతూ వస్తుంది. తాజాగా రవితేజ "మిస్టర్ బచ్చన్" అనే సినిమాలో హీరో గా నటించాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ మూవీ ని నిర్మించాడు. ఆగస్టు 15 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు ఘోరమైన నెగటివ్ టాక్ వచ్చింది.
దానితో ఈ మూవీ కి పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ నిర్మాత అయినటు వంటి విశ్వ ప్రసాద్ ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... మిస్టర్ బచ్చన్ సినిమా మంచి సినిమానే. కాకపోతే సినిమా విడుదలకు ముందు మిస్టర్ బచ్చన్ సినిమా దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ ఇచ్చిన ఇంటర్వ్యూల ప్రభావం వల్లే దానికి నెగిటివ్ టాక్ వచ్చింది అని ఆయన చెప్పుకొచ్చాడు.