ప్రమాదంలో సమంత...10 కేజీలు తగ్గిపోయిందా?

Veldandi Saikiran
టాలీవుడ్‌ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చి తన హవాను కొనసాగించింది. కోన్నేళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించిన సమంత వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది. అగ్ర హీరోల సరసన కథానాయికగా నటించింది. ఇక స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడడం, వివాహం చేసుకోవడం జరిగింది.

వివాహ అనంతరం సమంత సినిమాలలో పెద్దగా నటించలేదు. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది. అయినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. కొన్ని సంవత్సరాల తర్వాత చైతు, సామ్ ఏవో కొన్ని మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. విడాకులు అనంతరం సమంత వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ తన ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సమంతకు మయోసైటిస్ వ్యాధికి బారిన పడి తీవ్ర మనస్థాపానికి గురైంది.

ఇక ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇక ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకున్న సమంత మళ్ళీ సినిమాల్లో రాణించేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా.... సిటాడల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీతో ప్రేక్షకులను అలంకరించనున్నారు సమంత. సినిమాలను సమంత తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటూనే.... ఈవెంట్లలో పాల్గొని తన ఫ్యాన్స్ ను ఖుషి చేస్తూ ఉంటుంది.

అయితే రీసెంట్ గా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి సమంత బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చారు. ఈ సందర్భంగా సమంత తీసుకున్న వీడియోను ఆమె అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ వీడియో చూసిన చాలామంది అభిమానులు "సమంతకు ఏమైంది. మునుపటిలా అందంగా కనిపించడం లేదు. కాస్త బరువు తగ్గినట్టు ఉంది. తన ముఖంలో ఆనందం కనిపించడం లేదు" అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: