సినిమా ఇండస్ట్రీ లో ఒకే తేదీన అనేక సినిమాలు విడుదల అవడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే సినిమా విడుదల అయ్యి మంచి టాక్ ని తెచ్చుకున్నట్లు అయితే ఆ సినిమాకు ఏ మూవీ పోటీ లేకుండా ఉంటే భారీ కలెక్షన్లు మూవీ లకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఒకే రోజు అనేక సినిమాలు విడుదల అయినట్లు అయితే సినిమా బాగున్న కూడా కలెక్షన్లలో కాస్త డ్రాప్ కనిపించే అవకాశం ఉంటుంది. దానితో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఎక్కువగా శాతం సో లో గానే విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
కానీ కొన్ని సందర్భాలలో ఇతర సినిమాలతో పోటీ ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాఖీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , శ్రద్ధా శ్రీ నాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఇకపోతే అనూహ్యంగా ఈ సినిమాకు పోటీగా మరో సినిమా వచ్చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ "లక్కీ భాస్కర్" అనే మూవీని నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీ నుండి తప్పించి అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. దీనితో విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన మెకానిక్ రాఖీ సినిమాకు లక్కీ భాస్కర్ మూవీ పోటీగా బరిలోకి దిగబోతుంది. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.