బిగ్ బాస్ 8 : జబర్దస్త్ పై స్పెషల్ ఫోకస్.. రంగంలోకి అంతమంది కమెడియన్స్..?

MADDIBOINA AJAY KUMAR
అత్యంత క్రేజ్ కలిగిన రియాల్టీ షో లలో బిగ్ బాస్ ఒకటి. బిగ్ బాస్ రియాలిటీ షో మొదట ఇండియాలో హిందీ లో ప్రారంభం అయ్యి అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యింది. దానితో ఈ షో ను ఇప్పటికే అనేక ప్రాంతీయ భాషలలో కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితమే తెలుగు లో కూడా ఈ షో ను ప్రారంభించారు. ఇప్పటికే తెలుగు లో బిగ్ బాస్ బుల్లి తెరపై 7 సీజన్లను కంప్లీట్ చేసుకోగా ... ఓ టీ టీ లో ఒక సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ... రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక మూడవ సీజన్ నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లకి కూడా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.

ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ కు సంబంధించిన కొన్ని ప్రోమోలు కూడా బయటకు రాగా అవి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 వ తేదీ నుండి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి బిగ్ బాస్ బృందం జబర్దస్త్ కమెడియన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మొదటి నుండి కూడా ఈ సీజన్ లోకి జబర్దస్త్ నటులు అయినటువంటి బుల్లెట్ భాస్కర్ , కిరాక్ ఆర్పి , పవిత్ర , పొట్టి నరేష్ , రీతు చౌదరి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అనేక కథనాలు వచ్చాయి. కానీ ఇందులో పవిత్ర , పొట్టి నరేష్ బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇవ్వడం ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: