డబల్ ఇస్మార్ట్ : జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అది.. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఇవి..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని తాజాగా డబల్ ఇస్మార్ట్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంకా ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ పూర్తి అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.81 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.38 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.12 కోట్లు , ఈస్ట్ లో 71 లక్షలు , వెస్ట్ లో 40 లక్షలు ,  గుంటూరు లో 94 లక్షలు , కృష్ణ లో 58 లక్షలు , నెల్లూరు లో 33 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఐదు రోజుల్లో 9.27 కోట్ల షేర్ , 14.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఐదు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 95 లక్షల కలెక్షన్లు దక్కగా ... ఓవర్ సీస్ లో 75 లక్షల లక్షల దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 10.97 కోట్ల షేర్ , 17.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 38.03 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ ను అందుకుంటుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ కి వస్తున్న కలక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకోవడం దాదాపు అసంభవం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: