ఆకాష్ జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఇస్మార్ట్ శంకర్. 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా సీక్వెల్‌తో వీరిద్దరూ థియేటర్లలోకి వచ్చారు. ఇస్మార్ట్ శంకర్ ప్రభావంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.60 కోట్లపైనే జరిగింది. ట్రైలర్, టీజర్, పోస్టర్స్.. ఇతర ప్రమోషన్ కార్యక్రమాలతో జనం థియేటర్లకు బాగానే వచ్చారు. దీంతో డబుల్ ఇస్మార్ట్ కు ఓపెనింగ్స్ బాగానే వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 45 నుంచి 50 శాతం ఆక్యూపెన్సీ వచ్చిందని.. కానీ కర్ణాటక, హిందీ బెల్ట్‌లో మాత్రం డబుల్ ఇస్మార్ట్ ప్రభావం చూపలేకపోయింది. అయితే ఈ విషయం కాసేపు పక్కన పెడితే


 టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్  జగన్నాథ్. చిరుత, బుజ్జిగాడు వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఆంధ్రపోరి సినిమాతో హీరోగా పరిచయమయిన ఇంత వరకు సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. తండ్రి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2018లో 'మెహబూబా' సినిమా చేసిన కూడా హిట్ రాలేదు. తరువాత రొమాంటిక్, చోర్ బజార్.. సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అవేవి అనుకూల ఫలితాలు రాలేదు. తాజాగా ఆకాష్ పూరి నుండి ఆకాష్ జగన్నాథ్ గా పేరు మార్చుకున్న ఈ యంగ్ హీరో దాదాపు రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు, దీంతో నెక్ట్స్ సినిమాల


 గురించి ఏదైనా అప్ డేట్ ఇవ్వాల్సిందిగా ఆకాష్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు ఫ్యాన్స్. దీంతో ఈ కామెంట్స్ పై స్పందించాడు ఆకాష్ జగన్నాథ్. ఈ విషయమై ఆకాష్ మాట్లాడుతూ ” నేను ఖాళీగా ఉండడం కాదు, చాలా జాగ్రత్తగా ఉంటున్నాము, చాలా చాలా కథలు విన్నాను, ఒక గొప్ప అభిరుచిగల నిర్మాతను, అమేజింగ్ దర్శకుడితో పనిచేయబోతున్నాను, ఎక్కువ కథలు విన్నప్పుడు నేను కొంచం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూండేవాడిని కానీ దేవుడి దయవల్ల నేను నమ్మిన అమ్మవారి దయవల్ల ఒక మంచి టీమ్ సెట్ అయింది.ఈ సారి కొడితే గట్టిగా కొట్టాలి అనే ఉద్దేశంతో సినిమాను ఫిక్స్ చేశాను, ఈ ఆగస్టు 19న పూజ కార్యక్రమమంతో స్టార్ట్ కానుంది” అని తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: