తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యా గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. కడప జిల్లాకు చెందిన ఈ కుర్రాడు రాజా వారు రాణి గారు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా ఎస్‌ఆర్ కళ్యాణ మండపంతోనే సూపర్ హిట్ కొట్టాడు. మధ్యలో వరుసగా కొన్ని ప్లాఫ్ లు ఎదురైనా వినరో భాగ్యము విష్ణు కథతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. సక్సెస్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ఈ మధ్యన కాస్త గ్యాప్ తీసుకున్న అతను ‘క’ అనే సింగిల్ లెటర్ టైటిల్ తో ఓ మూవీ అనౌన్స్ చేశాడు. ఇందులో పోస్ట్ మ్యాన్ గా కిరణ్ అబ్బవరం స్టిల్స్,
యాక్టింగ్ అందరినీ ఆకట్టుకున్నాయి. కేవలం నటనలోనే కాదు రచయిత, నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకుంటున్నాడీ తెలుగబ్బాయి. ఇక నడవడిక, మాటతీరులోచూడడానికి అచ్చం పక్కింటబ్బాయిలా కనిపించే కిరణ్ అబ్బవరంకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క మొదటి సింగిల్అ నౌన్స్మెంట్ ని ఈరోజు సాయంత్రం 5:04 గంటలకి రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. యువ దర్శకులు సుజీత్ మరియు సందీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా,
చింతా గోపాల కృష్ణ రెడ్డి శ్రీ చక్రాస్ బ్యానర్‌పై సంయుక్తంగా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. మరోవైపు తన మొదటి హీరోయిన్ రహస్య గోరఖ్ తో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. ఈ ఏడాది మార్చి 13న వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడీ ప్రేమ పక్షుల పెళ్లి ముహూర్తానికి సమయం ఆసన్నమైంది. హీరో ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!