కీర్తి సురేష్ : స్టార్ హీరోలందరిలో అతనే లవర్ బాయ్..!!

murali krishna
స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది ఈ భామ. ఇప్పటికే మూడు నాలుగు లేడీ ఓరియేంటేడ్ మూవీస్ చేసింది కీర్తిసురేష్. ఇక ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ నిర్మాణ సంస్థ హోంబాలే కీర్తిసురేష్ తో సినిమా చేస్తున్నారు.రఘుతాత చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సీన్ రోల్డాన్ అందిస్తున్నారు. విజయ్ కిర్గందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలైంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ టెన్ హీరోయిన్ లలో కీర్తి సురేష్ కూడా ఒకరు.ఎలాంటి కథాచిత్రమైన అందులో నటించడం కాదు, జీవిస్తుంది అని చెప్పవచ్చు. అలాంటి కీర్తి సురేష్ ఏ సినిమా చూసిన చాలా డిఫరెంట్ కథలు ఉండే దాంట్లోనే నటిస్తుంది. అలాంటి కీర్తి సురేష్ ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ ఉన్న సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. ముఖ్యంగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహానటి, మిస్ ఇండియా, పెంగ్విన్ వంటి చిత్రాలు ఉన్నాయి. అలా ఈ చిత్రాల ద్వారా ఎంతో గుర్తింపు పొందిన కీర్తి సురేష్ మరో ఉమెన్ సెంట్రిక్ మూవీతో మన ముందుకు వస్తోంది. ఆ చిత్రం పేరు "రఘుతాత". అయితేఈ ముద్దు గుమ్మ తాజాగా బేబీ జాన్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో ఈ బ్యూటీబాలీవుడ్ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా సమంతహీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన తేరి అనే మూవీ కి అఫిషియల్ రీమేక్ గా రూపొందింది.

ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది. దానితో కీర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ... ఈ సందర్భంగా నటి.. ఎక్స్‌ వేదికగా అభిమానులతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఆ సంగతులివీ.. మీరు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం? నా పేరును వెండితెరపై తొలిసారిగా చూసిన క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. 'రఘుతాత' విషయంలో మీకు బాగా నచ్చింది? టీమ్‌ చూపిన ప్రేమ నటుడు వరుణ్‌ ధావన్‌ గురించి ఒక్క మాటలో.. లవర్‌ బాయ్‌ 'రఘుతాత'లో మీకు ఇష్టమైన సన్నివేశం ఏంటి?పెళ్లి సన్నివేశం. సినిమా చూశాక మీకూ అదే అనిపిస్తుంది.తమిళ్‌లో మీ కొత్త సినిమా ఏంటి?రివాల్వర్‌ రీట బాలీవుడ్‌ అరగేట్రం గురించి?'బేబీ జాన్‌'తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నా. నా స్నేహితుడు అట్లీ సినిమా 'తేరీ'కి రీమేక్ అది. కాలీస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా విడుదల కానుంది.'రెమో' వంటి సరదా సినిమాల్లో మిమ్మల్ని మళ్లీ చూడాలనుంది.నాకు ఇష్టమైన సినిమాల్లో 'రెమో' ఒకటి. అలాంటి స్క్రిప్ట్‌ కోసం వెయిట్ చేస్తున్నా. అనుష్క శెట్టి గురించి మీ మాటల్లో..?చాలా మంచి వ్యక్తి. నేనూ తనను స్వీటీ అనే పిలుస్తా.విమర్శలు, ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు?కీర్తి సురేశ్‌: మంచిని మాత్రమే తీసుకుని చెడ్డ విషయాలను ఎప్పటికప్పుడు విడిచిపెట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: