సినిమాలు ఫట్.. హీరోయిన్స్ హిట్..?

frame సినిమాలు ఫట్.. హీరోయిన్స్ హిట్..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మలలో చాలా వరకు వారు నటించిన సినిమాలు మంచి విజాయాలు సాధిస్తేనే వారికి మంచి గుర్తింపు , ఆ తర్వాత క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాగే కెరియర్ ప్రారంభం నుండే మంచి విజయాలను అందుకున్న వారే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి కూడా వెళుతూ ఉంటారు. కానీ మరి కొంత మంది విషయంలో ఎందుకు రివర్స్ గా జరుగుతుంటుంది. వారు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కూడా వారికి మాత్రం అద్భుతమైన స్థాయి క్రేజ్ లభిస్తూ ఉంటుంది.

అలాంటి వారు తెలుగు సినీ పరిశ్రమలో కూడా కొంత మంది ఉన్నారు. అలాంటి వారి గురించి తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో విజయాలు లేకపోయిన అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నటిమానులలో కావ్య దాపర్ ఒకరు. ఈ బ్యూటీ ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అందులో ఏక్ మినీ కథ సినిమా ప్రేక్షకులను బాగానే మెప్పించింది. కాకపోతే ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. దాని తర్వాత ఈమె చాలా సినిమాలలో హీరోయిన్గా నటించిన అందులో ఏ మూవీ కూడా గొప్ప స్థాయి విజయాన్ని అందుకోలేదు.

కాకపోతే ఈమెకు మాత్రం అద్భుతమైన క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమంలో ఉంది. దానితో వరుసగా ఈ బ్యూటీ కి సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇలాంటి బ్యూటీలలో మరో ముద్దుగుమ్మ మాళవికా శర్మ ఒకరు. ఈమె కూడా చాలా సినిమాలలో నటిస్తూ వస్తున్న మంచి విజయాలు మాత్రం దక్కడం లేదు. కాకపోతే ఈమె తన అందంతో , నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తూ ఉండడంతో వరుసగా సినిమాలలో అవకాశాలు మాత్రం దక్కుతున్నాయి. అలా ఈ మధ్య కాలంలో విజయాలు లేకపోయినా వరుస అవకాశాలను దక్కించుకున్న బ్యూటీలలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ముందు వరుసలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: