ఆ మహాతల్లి వల్లే పూరి సినిమాలు ఫ్లాప్.. డబుల్ ఇస్మార్ట్ పై సినీ క్రిటిక్ షాకింగ్ కామెంట్స్.?

Pandrala Sravanthi
భారీ అంచనాల మధ్య విడుదలైన డబుల్ ఇస్మార్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అనేంతలా మాత్రం లేదు. ఏదో బిలో యావరేజ్ అన్నట్లు ఉంది. ఇస్మార్ట్ మూవీ కి ఇది సీక్వెల్ అని చెప్పారు.కానీ డబుల్ ఇస్మార్ట్ మూవీ సీక్వెలా.. ప్రీక్వెలా.. ఇక్వాలా.. ఏది తెలియడం లేదు అంటూ ఈ మూవీపై సంచలన రివ్యూ ఇచ్చారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్..ఆయన సినిమా చూసి వచ్చాక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఒక చిన్న లైన్ ని పట్టుకొని పూరి జగన్నాథ్ ఒక వారంలోనే కథ తీయగలరు. అంత గొప్ప డైరెక్టర్. కానీ ఈ సినిమాని ఎందుకు తీసారో ఎలా తీసారో అసలు ఇందులో ఉన్న క్యారెక్టర్ లని ఎందుకు తీసుకువచ్చారో కూడా అర్థం అవ్వడం లేదు. ఈ సినిమాని చూసిన చాలామంది పూరి జగన్నాథ్ కి చిప్ దొబ్బింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇది నిజమే..అయితే ఈ సినిమాలో పూర్తిగా చిప్ గురించే ఉంటుంది. కాబట్టి అందుకే పూరీకి చిప్ దొబ్బింది అని  రివ్యూలు ఇస్తున్నారు. ఇస్మార్ట్ మూవీ ని చూసి ఎంత హ్యాపీగా ఉన్నారో డబుల్ ఇస్మార్ట్ సినిమా వల్ల అంత నిరాశ అయ్యారు అభిమానులు.


పూరి జగన్నాథ్ అప్పట్లో ఎంతో మంది ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్స్ ఇచ్చి స్టార్ డైరెక్టర్గా మారారు.కానీ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న ఆర్టిస్టులను ఆయన కింది స్థాయికి తీసుకువస్తున్నారు.అలా లైగర్ మూవీ ద్వారా ఎంతో క్రేజ్ ఉన్న రమ్యకృష్ణ కి అవకాశాలు తక్కువయేలా చేశారు. ఇక సలార్ వంటి సినిమాలో అద్భుతంగా నటించిన ఝాన్సీ ని ఈ సినిమాలో మరింత అద్భుతంగా చూపించాలి.కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఝాన్సీ పాత్రని అంత బాగా చూపెట్టలేదు. ఇక నటి ప్రగతిని ఎందుకు తీసుకువచ్చారో తెలియదు.అలాగే కమెడియన్ అలీ పాత్రను కూడా ఎందుకు చూపించారో..అసలు కథతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఇక ఆలీ నటించిన ఇన్ని సినిమాల్లో వరస్ట్ క్యారెక్టర్ అంటే ఇదే.. అయితే ఆలీ మాత్రం తన పాత్రకి ప్రాణం పోశారు. ఇక ఇందులో నటించిన హీరోయిన్ ఐటెం సాంగ్స్ కి అయితే బాగా సెట్ అవుతుంది.


కలవడంతోనే ఐ లవ్ యు చెప్పడం రా ఒక పాటేసుకుందాం అన్నట్లుగానే వీరి మధ్యలో లవ్ స్టోరీ చూపించారు. వీరి మధ్య ఉన్న లవ్ ఆసక్తికరంగా కూడా లేదు. అలాగే బాలీవుడ్ స్టార్ అయినటువంటి సంజయ్ దత్ ఈ సినిమాకి ప్లస్.. కానీ సంజయ్ దత్ ని కూడా పూరి జగన్నాథ్ సరిగ్గా చూపించలేకపోయారు. ఇక ఈ సినిమాకి మణిశర్మ ప్రాణం పెట్టి సంగీతం అందించారు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కానీ పూరి జగన్నాథ్ మాత్రమే సినిమా తీయడంలో తడబడ్డాడు. ఏ కోణంలో చూసినా కూడా ఈ సినిమా అంత ఆసక్తికరంగా లేదు. ఇక ఈ సినిమాలో పెట్టుబడి కూడా ఓ పావలా వంతు  ఛార్మి పెట్టింది.అయినా కూడా పూరి జగన్నాథ్ ఇలా సినిమాలు ఎందుకు తీస్తున్నారో తెలియడం లేదు. ఎంతో గొప్ప డైరెక్టర్.. కానీ ఆయన నుండి ఇలాంటి సినిమాలు రావడం అభిమానులు ఊహించలేకపోతున్నారు అని  డబుల్ ఇస్మార్ట్ మూవీ పై రివ్యూ ఇచ్చారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: