వామ్మో: ఈ వయసులో బికినీతో హల్చల్ చేస్తున్న మంచు లక్ష్మి..!

Divya
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న మంచు లక్ష్మి ఇటీవల తన మకాన్ని పూర్తిగా ముంబైకి మార్చేసింది. ఒకవైపు నిర్మాతగా నటిగా వెబ్ సిరీస్లలో కూడా సత్తా చాటిన మంచు లక్ష్మి ప్రస్తుతం బిజీబిజీగా గడిపేస్తోంది . ఇటీవల తన కెరీయర్ని కొత్త మలుపు తిప్పేందుకు ముంబైకి షిఫ్ట్ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మంచు లక్ష్మి ముంబైకి మారడం వెనుక పలు రకాల కారణాలు ఉన్నాయట. బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈమె ముంబైకి వెళ్ళినట్లు ఆమధ్య ఇంటర్వ్యూలో కూడా తెలియజేసిందట.

కొత్త అవకాశాల కోసం ఆడిషన్స్కు కూడా వెళుతున్నానని తెలియజేసింది మంచు లక్ష్మి. ముంబై కి వెళ్ళాక గ్లామర్ డోస్ పెంచడంలో మరింత దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో మంచు లక్ష్మి పోస్ట్ చేసే ఫోటోలు సైతం నేటిజెన్లను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇటీవల ఆమె బికినీలో షేర్ చేసిన ఫోటోలు ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పింక్ కలర్ బికినీలో బీచ్ లో సరదాగా సమయాన్ని గడుపుతున్నట్టుగా మంచు లక్ష్మి కనిపిస్తుంది. అలాగే ఆమె స్నేహితులతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది.

ఈ ఫోటోలు చూసిన అభిమానులు తెగ లైక్స్ కామెంట్స్ చేస్తున్నారు. బీచ్ లో కాసేపు సేద తీరుతున్నట్టుగా మంచు లక్ష్మి కొన్ని ఫోటోలను షేర్ చేసింది అది కూడా టూ పీస్ బికినీలో కనిపించింది మంచు లక్ష్మి.మంచు లక్ష్మీ నటించిన ఆదిపర్వం సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది ఈ చిత్రంలో ఈమె 7 విభిన్నమైన పాత్రలలో కూడా నటించినట్లు తెలుస్తోంది అది కూడా డూప్ లేకుండా నటించిందట. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆమె బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకోవడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నానని ఈ సినిమా ద్వారా కచ్చితంగా అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించ గలుగుతానని నమ్మకాన్ని తెలియజేసింది మంచు లక్ష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: