ప్రెజెంట్ సౌత్ ఇండియా సహా హిందీ మార్కెట్ లో కూడా మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్స్ కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. కానీ ఈ రకంగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్ మాత్రం అరుదే అని చెప్పాలి. అంతే కాకుండా హిందీ మార్కెట్ నుంచి వచ్చి తెలుగులో కూడా రాణించిన హీరోయిన్స్ అయితే మరీ తక్కువే.. కాగా ఆలా హిందీ మార్కెట్ నుంచి వచ్చి తెలుగు ఆడియెన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ ప్రెజెంట్ జెనరేషన్ లో ఎవరైనా ఉన్నారు అంటే అది నటి మృణాల్ ఠాకూర్ అనే చెప్పాలి..'సీతారామం' సినిమాతో టాలీవుడ్లోకి వచ్చిన మృణాల్ ఠాకూర్ ఇక్కడ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.ఆ తర్వాత నానితో చేసిన 'హాయ్ నాన్న' కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక విజయ దేవరకొండతో తీసిన 'ఫ్యామిలీ స్టార్' మృణాల్ ఠాకూర్‌కి హ్యాట్రిక్ ఇవ్వలేకపోయింది.వరుస విజయాలతో జోరుమీద ఉన్న ప్రభాస్, డైరక్టర్ హను రాఘవపూడితో ఓ సినిమాను తీస్తున్నాడు.ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్ తెరకెక్కే ఈ లవ్ స్టోరికి 'ఫౌజీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అంటూ వార్తలొచ్చాయి.గడిచిన కొన్ని వారాలు నుంచి మృణాల్ ఠాకూర్ తెలుగులో ఒక బిగ్గెస్ట్ ఆఫర్ ని సొంతం చేసుకుంది అని పలు రూమర్స్ గుప్పుమన్నాయి. మరి ఆ సినిమానే తనకి తెలుగులో డెబ్యూ ఇచ్చిన దర్శకుడు హను రాఘవాపుడి అలాగే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో వార్తలు బయటకి వచ్చాయి. దీనితో చాలా మంది ఇది నిజమే అని ఫిక్స్ కూడా అయిపోయారు.
ఇక బాలీవుడ్ ట్రాకర్స్ అయితే ఇద్దరికీ కలిపి ఓ ఫస్ట్ లుక్ కూడా వచ్చేస్తుంది అని ఈ ఆగస్ట్ 17 నే అది కూడా అంటూ పలు రూమర్స్ స్ప్రెడ్ చేసారు. కానీ తీరా చూస్తే మృణాల్ ఠాకూర్ అందరికీ షాకిచ్చింది. తాను సమాధానం ఇస్తూ.. మీ వైబ్ ని కిల్ చేస్తున్నా నాకు తప్పడం లేదు కానీ నేను ఆ సినిమాలో భాగం కాదు అంటూ క్రేజీ రిప్లై ఇచ్చేసింది.తాను సమాధానం ఇస్తూ.. మీ వైబ్ ని కిల్ చేస్తున్నా నాకు తప్పడం లేదు కానీ నేను ఆ సినిమాలో భాగం కాదు అంటూ క్రేజీ రిప్లై ఇచ్చేసింది. దీనితో ఇప్పుడు తన రిప్లై పెద్ద ట్విస్ట్ నే అందరికీ ఇచ్చింది అని చెప్పాలి. సో మొత్తానికి ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో మృణాల్ లేదు అని అందరికీ దీనితో అర్ధం అయ్యిపోయింది. కాగా గత కొన్నాళ్ల కితమే మృణాల్ తెలుగులో పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే టాక్ ఉంది. కానీ ఇటీవల ప్రభాస్ చిత్రమే కల్కి 2898 ఎడి లో కనిపించింది. సో ఈ సినిమాలో నటించే ఛాన్స్ లు ఉన్నాయని చాలా మంది భావించారు.తాజాగా ప్రభాస్ తో మృణాల్ ఉన్న ఫోటోను ఓ నెటిజన్ షేర్ చేస్తూ.. ఇది హను రాఘవపూడి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ పై మృణాల్ రియాక్ట్ అవుతూ మీ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నందుకు క్షమించండి. నేను ఈ ప్రాజెక్టులో లేను అంటూ కామెంట్ చేసిందిసో ఈ వార్తల్లో నిజం లేదని ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి.ఇక ప్రభాస్ సరసన ఈ ప్రాజెక్టులో ఎవరు కనిపిస్తారో చూడాలి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పీరియాడికల్ డ్రామాగా ఓ సినిమా రానుంది.