ఫ్యాన్స్ బేస్ ను పెంచుకుంటున్న నాని !
ఈమూవీ ట్రైలర్ ను హైదరాబాద్ సుదర్శన్ ధియేటర్లో తన అభిమానుల కోలాహలం మధ్య లాంచ్ చేయడం గమనిస్తే నాని తన అభిమానుల సంఖ్య పెంచుకోవడానికి చాల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. ఈమూవీ టైటిల్ చాల డిఫరెంట్ గా ఉండటంతో ఈమూవీ విడుదల కాకుండానే ఈమూవీ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈమూవీ ట్రైలర్ ను బట్టి కథను అంచనా వేస్తూ అప్పుడే సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది.
తనకు ఎంత కోపం వచ్చినా అణుచుకుని తల్లికి ఇచ్చిన మాట కోసం కేవలం శనివారం మాత్రమే తన కోపాన్ని వ్యక్తపరిచే మాస్ హీరో పాత్రలో నాని బాగా రాణించాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. తన స్టయిల్ కి భిన్నంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ ‘సరిపోదా శనివారం’ మూవీని ఒక యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించినట్లు అనిపిస్తోంది. కంప్లీట్ యాక్షన్ కం రివెంజ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈమూవీకి పోటీ లేకపోవడంతో ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
పెద్ద క్యాస్టింగ్, భారీ బడ్జెట్ తో పాటు గతంలో వినని ఒక స్టోరీ పాయింట్ తీసుకుని అంచనాలు పెంచడంలో ఈమూవీ విడుదల కాకుండానే అంచనాలను పెంచుకుంది. దీనికితోడు ఈమూవీకి బిజినెస్ కూడ బాగా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఫ్యాన్స్ వాడే పోతారు అందరూ పోతారు ఊతపదాన్ని నానితో పలికించడంతో నాని డైలాగ్ కు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. విలన్ గా ఎస్ జె సూర్య విభిన్ననటన కానిస్టేబుల్ గా ప్రియాంక మోహన్ ఈమూవీకి అదనపు ఆకర్షణ కాబోతున్నారు..