ఆపదలో ఉన్న ధనుష్, విశాల్.. ఆదుకునే వాళ్లు వారే..?
ఈ కారణంగా నిర్మాతలు వణికి పోతున్నారు. ఈ అసోసియేషన్ సభ్యులు నిర్మాతలతో చర్చలు జరిపేందుకు కూడా రెడీ అయ్యారు. ధనుష్, విశాల్ తరపున మాట్లాడేందుకు తమిళ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో త్వరలోనే భేటీ అయ్యే అవకాశం ఉంది. అధ్యక్షుడు నాజర్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఉపాధ్యక్షుడు పూచి మురుగన్, హీరో కార్తీ, అధ్యక్షుడు నాజర్‌లతో ముందుగా అంతర్గత సమావేశం జరిగింది. గౌరవ కార్యదర్శి విశాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశం అనంతరం నాజర్ మీడియాతో మాట్లాడుతూ, తమిళ నిర్మాతల సంఘం విధించిన నిబంధనలపై తాము చర్చించామని, అవి ఆమోదయోగ్యం కాదని చెప్పారు. నిర్మాతల సంఘంతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, అంతర్గతంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తాము మీడియాతో చర్చించబోమని, సినీ పరిశ్రమలో సామరస్యమే ధ్యేయమని నాజర్ ఉద్ఘాటించారు. ఇప్పటి వరకు పనులు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు.
నాసర్ కొంతమంది నటులను కూడా విమర్శించారు, వారి అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ వారికి ఉన్నప్పటికీ, కేవలం చర్చలు సమస్యలను పరిష్కరిస్తాయని చెప్పలేమన్నట్లు మాట్లాడారు. ఈయన వచ్చే వారం నిర్మాతల సంఘంతో సమావేశం కానున్నారు. ప్రొడక్షన్ ఖర్చులు పెరగడం, నటీనటుల వేతనాలు పెరగడం, అడ్వాన్స్ చెల్లింపులు, షెడ్యూల్ గొడవలు వంటి సమస్యలను పరిష్కరించాలని నిర్మాతల సంఘం గతంలో పట్టుబట్టింది. నటులు ధనుష్, విశాల్ పై నిషేధం విధించడం జరిగింది. వారి డిమాండ్లు నెరవేరే వరకు నవంబర్ 1 నుంచి తన సినిమా పనులన్నింటినీ నిలిపివేస్తానని నాజర్ పేర్కొన్నాడు.