అనుష్కకు టాలీవుడ్ హీరో వార్నింగ్ ?
తన సినిమాల ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన అనుష్క ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. ప్రస్తుతం అనుష్క సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. ఎక్కువగా సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపించడం లేదు. కొద్ది రోజుల క్రితమే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అనుష్క కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి తన కెరియర్ తానే దెబ్బతినేలా చేసుకుంది.
మరీ ముఖ్యంగా వేదం, సైజ్ జీరో వంటి సినిమాల్లో నటించడంతో ప్రేక్షకులు అనుష్కను అంగీకరించలేకపోయారు. అనుష్క వేదం సినిమాలో వేశ్యపాత్రలో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. వేదం సినిమా మాత్రం అనుష్కకు మంచి పేరును తెచ్చినప్పటికీ తన అభిమానులు కాస్త ఫీయిల్ అయినట్టు తెలిసింది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించిన అనుష్కను చూసిన ఓ టాలీవుడ్ హీరో ఇంకోసారి అలాంటి పాత్రలో నటించొద్దని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడట.
ఇక ఆ హీరో మరెవరో కాదు ప్రభాస్. వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు. ఒకానొక సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ....వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్ కుటుంబ సభ్యులు వీరి వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఇప్పటివరకు వివాహం చేసుకోకుండా ఇద్దరు సింగిల్గానే ఉంటున్నారు. ఈ జంట వివాహం చేసుకుంటే ఎంతో బాగుంటుందని ప్రభాస్, అనుష్క అభిమానులు కోరుకుంటున్నారు.